మొత్తానికి బంగారు ధర రికార్డు సృష్టించిందీ రోజు

అయిదు రోజుల పాటు వరసగా పెరిగి పెరిగి బంగారు చివరకు మంగళవారంనాడు పది గ్రాముల (99.9 శాతం ప్యూర్ ) ధర రు. 39,670 దగ్గిర స్థిరపడింది. అయితే, ముంబైలో మాత్రం పదిగ్రాముల ధర రు. 40వేలకు చేరింది.ఇది రికార్డు.న్యూ ఢిల్లీ మార్కెట్ లో గోల్డ్ సోమవారం నాడు అల్ టైం హై ని టచ్ చేసిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన ప్రకటిచింది.
ఇక 99.5 శాతం ప్యూర్ గోల్డ్ ధర పది గ్రాములు రు39,500 పలుకుతూ ఉంది.సావరిన్ గోల్డ్ 8 గ్రాముల ధర రు.29,500. హైదరాబాద్ మార్కెట్ల్ 10 గ్రాములు 24 క్యారట్ గోల్డ్ ధర రు. 39,950 కి చేరింది. MCX లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ పదిగ్రాముల ధర రు.39,940 చేరి రికార్డు సృష్టించింది.
దీనితో ఈ ఏడాది మొత్తంగా తీసుకుంటే బంగారు ధర 20 శాతం పెరిగింది.
మంగళవారం నాడు వెండికూడా రు. 190 పెరిగి కిలో ధర రు. 49,670 కి చేరింది. అంతర్జాతీయంగా న్యూయార్క్ లో గోల్డ్ ఔన్స్ ధర 1541.40 అమెరికన్ డాలర్లు పలికింది. వెండి ఔన్స్ 17,78 అమెరికన్ డాలర్లు పలికింది. అంతర్జాతీయంగా ఈక్విటీ సూచికలు బలపడినా బంగారు మాత్రం దృఢంగా నిలబడిఉండటం విశేషం. స్పాట్ రుపాయ కూడా డాలర్ తో పోలిస్తే 30 పైసలు బలపడింది.