నిన్నటి ఆల్ టైం హై నుంచి కొద్దిగా తగ్గిన బంగారం ధర…

భారతదేశంలో గోల్డ్ మార్కెట్ చిత్రమయిన పరిస్థితి ఎదుర్కొంటూ ఉంది. బంగారం ధర బాగా పెరిగింది. అయితే, వ్యాపారం మందగించింది. పెద్దగా ప్రజలు కొనుగోలు చేయడం లేదు. దీనితో బంగారు దిగుమతులు భారీగా పడిపోయాయి.
నిన్న ఆల్ టైం హై కి చేరుకున్న బంగారు ధర ఈ రోజు రు.160 తగ్గి పది గ్రాముల ధర రు.36,807 దగ్గిర ఆగింది.
అంతర్జాతీయంగా మంగళవారం నాడు డిమాండ్ మందగించడంతో ఇలా తగ్గిందని ఆల్ ఇండియా సరాఫ అసోసియేషన్ వెల్లడించింది. వెండి కూడా రు. 80 తగ్గి కిలో రు.43,020 దగ్గిర ఆగింది.

https://trendingtelugunews.com/gold-silver-prices-explode-to-scale-up-record-high/

అంతర్జాతీయ మార్కెట్లో బంగారు ధర ఔన్స్ న్యూయార్క్ లో 1462 అమెరికన్ డాలర్లు పలికింది. సిల్వర్ కొద్దిగా తగ్గి ఔన్స్ ధర 16.43 డాలర్లు పలికింది.
జాతీయ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల 99.9 ప్యూర్ గోల్డ్ ధర రు.36,807 లుంటే, 99.5 శాతం ప్యూర్ ధర 153 తగ్గిరు. 36,635 పలికింది. సావరిన్ గోల్డ్ ఎనిమిది గ్రాముల ధర రు. 27,600లుగా ఉంది.
సోమవారం నాడు గతంలో ఎన్నడూ లేనంగా బంగారు పది గ్రాముల ధర రు. 36,970 దాక వెళ్లింది.
ఇది కూడా చదవండి: కాశ్మీర్ కుట్ర కేసు అంటే ఏమిటి? దాని పర్యవసానాలు ఏమిటి?
ఇది ఇలా ఉంటే, ధరలు విపరీతంగా పెరుగుతూ ఉండటంతో భారతదేశపు బంగారు దిగుమతులు బాగా పడిపోయాయి.జూలై నెలలో గత ఏడాది జూలై తో పోలిస్తేమూడేళ్ల కిందటి లాగా 55 శాతం పడిపోయాయి. ధరలు పెరగడానికి తోడు ఇంపోర్టు డ్యూటీకూడా పెరగడం దీనికి కారణమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచంలో అంత్యంత అధికంగా కొనుగోలు చేసే భారతదేశం నుంచి దిగుమతులు తగ్గిపోతే అంతర్జాతీయంగా లాభాలు తగ్గిపోతాయి. ధరలు పెరిగినా వ్యాపారం మందగిస్తుంది.

ఇది కూడా చదవండి

 *రష్యా పిచ్చి పిచ్చిగా బంగారు కొంటాంది, ఎందుకో తెలుసా?
*గోల్డ్ కొనాలనుకుంటున్నారా, అయితే ఇది చదవండి

 

ఈ జూలై ఇండియా 39.66 టన్నుల బంగారు దిగుమతి చేసుకుంది. గత ఏడాది ఇదెంతో తెలుసా?88.16 టన్నులు. ద్రవ్యరూపేణ చెప్పుకుంటే 1.71 బిలియన్ల డాలర్ల బిజినెస్ తగ్గింది.
ఈబడ్జెట్ లో గోల్డ్ దిగుమతి సుంకాలన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచడంతో గత నెలలో బంగారు ధరలు విపరీతంగా పెరిగాయి.
దీనితో అంతర్జాతీయ డిమాండ్ పెరగడంతో ధరలకు నిజంగానే రెక్కలొచ్చాయి. ధరలు పెరుగుతున్నాయి గాని భారత దేశంలో డిమాండ్ పెరగడంలేదని, ఆగస్టులో కూడా బంగారు దిగుమతులు పెరగకపోవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

https://trendingtelugunews.com/tiruma-annual-brahmotsavas-arrangement-in-full-swing/