GOLD NEWS ఇంకా పెరిగిన బంగారు వెండి ధర…

బంగారు ధర గురువారం నాడు మరింత పెరిగింది. పది గ్రాముల ధర రు. 550 పెరిగి రికార్డు స్థాయికి అంటే రు. 38,470కి చేరింది.
అంతర్జాతీయ పరిణామం లాగానే భారతదేశంలో కూడా ఇన్వెస్టర్ లు బంగారు మీద ఇన్వెస్ట్ చేయాలనుకోవడంతో బంగారు ధరలు పెరిగాయి. అమెరికా-చైనా ట్రేడ్ వార్ ఉద్రికత్త సడలే అవకాశం కనిపించపోవడంతో మార్కెట్లో అనిశ్చితి పెరుగుతూ ఉండటం దీనికి దోహపడింది.
బంగారు లాగే వెండి కూడా దూసుకుపోయింది. కిలో ధర రు. 44వేలు దాటింది. వెండిధర రోజు ఏకంగా రు. 630 పెరిగి రు. 44,300లకు చేరింది. కాయిన్ మేకర్స్, ఇండస్ట్రియల్ యూనిట్స్ నుంచి కొనుగోళ్లు కూడా భారీగా పెరిగాయి.
అంతర్జాతీయ మార్కెట్లో గత ఆరేళ్లలో మొదటి సారి బంగారు ఔన్స్ ధర 1500 డాలర్లకు చేరింది. దీనికి పూర్తిగా యుఎస్ చైనా ట్రేడ్ వారే కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ఈ ట్రేడ్ వార్ ఆయాదేశాల ఆర్థిక సంక్షోభానికి తోడవడంతో ఇన్వెస్టర్లు బంగారు వైపు పరుగులు పెడుతున్నారు.
స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 1500 డాలర్లను తాకడం 2013 తర్వాత ఇదే ప్రథమం.
జాతీయరాజధాని మార్కెట్లో 99.9 శాతం ప్యూర్ గోల్డ్ పది గ్రాముల ధర 38,470 రుపాయలు పలికితే, 99.5 శాతం ప్యూర్ గోల్డ్ ధర రు.38,300 పలికిందని ఆలిండియా సరఫా అసోసియేషన్ ఒక ప్రకటనలో పేర్కొంది.
సావరిన్ గోల్డ్ గురువారంనాడు ఎనిమిది గ్రాములు రు.700 పెరిగి రు. 28,500ల దగ్గిర స్థిరపడింది.
వెండివిషయానికి వస్తే, సిల్వర్ కాయిన్స్ డిమాండ్ బాగా పెరిగింది. 100 నాణేల కనుగోలు ధర వేయిరుపాయలు పెరిగి 87,000 లకు చేరింది.అమ్మకం ధర రు.80,000.

https://trendingtelugunews.com/gold-silver-prices-explode-to-scale-up-record-high/