హైదరాబాద్ కోచింగ్ సెంటర్ల మీద దాడులు కొనసాగింపు…

నేడు కూడా నిబంధనలకు విరుద్ధంగా, ఫైర్ సేఫ్టీ చర్యలను పాటించని కోచింగ్ సెంటర్ల మీద దాడులు జరిగాయి. పరిశీలన అనంతరం జిహెచ్ ఎం సి అధికారులు  మూసివేత కు చర్యలు తీసుకుంటున్నారు.
నేడు మూడు మార్గాల్లో 114 కోచింగ్ సెంటర్ల ను సీజ్ చేసేందుకు జిహెచ్ఎంసి ఎన్ఫోర్స్మెంట్ విభాగం సిద్ధమవుతూ ఉంది.
ఫైర్ సేఫ్టీ నిబంధనలు, ఇతర భద్రతా చర్యలను పాటించాలని ఇప్పటికే పలుసార్లు నోటీసులు అందజేసినా ఖాతరు చేయని కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకుంటున్నారు.
మెహిదీపట్నం నుండి గచ్చిబౌలి మార్గంలో 30 కోచింగ్ సెంటర్ లపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమయిందని అధికారులు చెప్పారు.
కూకట్ పల్లి నుండి కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ మార్గంలో ఉన్న 46 కోచింగ్ సెంటర్లపై చర్యలుంటాయి.
అశోక్ నగర్ నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్, హిమాయత్ నగర్, నారాయణగూడ, బషీర్బాగ్ వరకు ఉన్న 38 కోచింగ్ సెంటర్లపై చర్యలకు రంగం సిద్ధమయింది.