ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య

తెదేపా సీనియర్‌ నేత, ఆంధ్రప్రదేశ్  శాసనసభ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు  ఆత్మహత్య చేసుకున్నారు.ఆయన వయసు 77సంవత్సరాలు. ఈ మధ్యాహ్నంఆయన హైదరాబాద్  నివాసంలోనే ఉరివేసుకున్నారు. అయితే,ఈవిషయంతెలియగానేకుటుంబసభ్యులుఆయననుబసవతారకం అసుపత్రికి తరలించారు.
హైదరాబాద్‌లోని బసవతారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
 అయితే ఇది ఆత్మహత్య కాదనికొందరంటున్నారు. ఇవాళ ఉదయం తీవ్ర గుండె పోటుకు గురైన ఆయన్ను.. కుటుంబ సభ్యలు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయిందనివారు చెబుతున్నారు..
ఈ మధ్యఆయన మీద కేసులు నమోదయ్యాయి.ఆయన కుటుంబ సభ్యుల అక్రమాలనీ ,అసెంబ్లీ స్పీకర్ అధికారాల దుర్వినియోగం,స్పీకర్ కార్యాయం పర్నిచర్ కాజేయాలనుకోవడం వంటి కేసులు నమోదయ్యాయి.చివరకు ఫర్నిచర్ ను ఆయన వాపసు ఇచ్చారు.దీని మీద కేసులు  నమోదయ్యాయి.
కేసు,అధికారు దుర్వినియోగ ఆరోపణల  ఒత్తిళ్ల కారణంగానే కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆయన అనుచరులు చెబుతున్నారు.
మరోవైపు కోడెల గుండెపోటుతోనే ఆస్పత్రిలో ఒక ప్రచారం సాగుతూన్నది.
* తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయిన కోడెల శివ ప్రసాదరావు ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత ఎన్నికైన తొలి శాసనసభాపతి.
* 1983 లో వైద్య వృత్తి నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు.
* 1983 నుంచి 2004 వరకు వరసగా ఐదుసార్లు నరసరావుపేట నుంచి గెలిచారు.
* ఆ తర్వాత రెండుసార్లు ఓటమిపాలైనా, 2014లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సత్తెనపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ తరపున గెలుపొందారు.
* శాసనసభకు ఆరుసార్లు ఎన్నికైన డాక్టర్ కోడెల ఎన్టీఆర్‌, చంద్రబాబు మంత్రివర్గంలో పలు శాఖల్లో పనిచేశారు.
* కోడెల శివప్రసాదరావు గుంటూరు జిల్లా, నకరికల్లు మండలం కండ్లగుంట గ్రామంలో 1947 మే 2వ తేదీన కోడెల శివప్రసాదరావు జన్మించారు.
* తల్లిదండ్రులు సంజీవయ్య, లక్ష్మీనర్సమ్మ. దిగువ మధ్యతరగతి కుటుంబం.
* కోడెల అయిదో తరగతి వరకూ స్వగ్రామంలోనే చదివారు.
* కొద్దిరోజులు సిరిపురంలో, ఆ తర్వాత నర్సరావుపేటలో పదో తరగతి పూర్తి చేసిన ఆయన విజయవాడ లయోలా కళాశాల పీయూసీ చదివారు.
* చిన్న తనంలోనే తోబుట్టువులు అనారోగ్యంతో చనిపోవడం కోడెలను తీవ్రంగా కలిచివేచింది. ఆ విషాదమే డాక్టర్ కావాలనే ఆలోచనకు బీజం వేసింది.
* కోడెల తాతయ్య ప్రోత్సాహంతో వైద్య విద్యనభ్యసించడానికి ముందడుగు వేసారు.
* గుంటూరు ఎ.సి కళాశాలలో చేరి మళ్లీ పీయూసీ చదివి మంచి మార్కులు తెచ్చుకుని కర్నూలు వైద్య కళాశాలలో చేరారు.
* రెండున్నరేళ్ళ తర్వాత గుంటూరుకు మారి అక్కడే ఎంబీబీఎస్ పూర్తి చేశారు.
* వారణాసిలో ఎం.ఎస్ చదివారు.
* నరసరావుపేటలో ఆస్పత్రి నెలకొల్పి వైద్యవృత్తిని చేపట్టారు.
* అనతి కాలంలోనే తిరుగులేని సర్జన్‌గా పేరు తెచ్చుకున్నారు.
* డాక్టర్ కోడెల శివప్రసాదరావు సరైన వ్యక్తి అని భావించిన ఎన్టీఆర్ 1982లొ తెలుగుదేశం పార్టీలోకి ఆహ్యానించారు.
* ఇష్టం లేకపోయినప్పటికీ ఎన్టీఆర్‌ పిలుపు మేరకు 1983లో తెలుగుదేశం పార్టీలో చేరి మొదటిసారిగా నరసరావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
కోడెల రాజకీయ ప్రస్థానం
1983, 85, 89, 1994, 2014 ఎన్నికలలో నరసరావుపేట నియోజకవర్గానికి టిడిపి తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2014లో సత్తెనపల్లి నుంచి గెలుపొందారు. 1987-88 మధ్యలో హోంమంత్రిగా పనిచేశారు. 1996-97 భారీ మధ్యతరహా, నీటిపారుదల మంత్రిగా, 197-99 మధ్యలో పంచాయతీరాజ్‌ శాఖమంత్రిగా కోడెల పనిచేశారు. 2014-19 వరకూ ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా ఆయన పనిచేశారు. అయితే 2019 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు చేతిలో ఓడిపోయారు.
* కోడెల భార్య శశికళ గృహిణి కాగా, వీరికి ముగ్గురు పిల్లలు (విజయలక్ష్మి, శివరామకృష్ణ, సత్యన్నారాయణ). ముగ్గురు కూడా డాక్టర్ వృత్తిలోనే ఉన్నారు.

కేస్ నమోదు :అంజనికుమార్, హైదరాబాద్ సిపి

కోడెల శివప్రసాద్ రావు అనుమానాస్పద మృతి పై కేసు నమోదు చేశామని సీపీ   అంజనికుమార్    తెలిపారు.

మూడు టీమ్ లతో దర్యాప్తు జరువుతున్నామని, బంజారాహిల్స్ ఏసీపీ అద్వర్యంలో విచారణ కొనసాగుతోందని ఆయన .తెలిపారు

పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత శివప్రసాదరావు మృతిపై క్లారిటీ వస్తుంది. క్లూస్ టీం, టెక్నీకల్ టీమ్ లు దర్యాప్తు చేస్తున్నాయని ఆయన తెలిపారు.