టార్గెట్లు పెట్టుకుని ఇసుకను దోచేస్తున్నారు, అందుకే ఆత్మహత్యలు : చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేతలు  టార్గెట్లు పెట్టుకుని  అన్నింటిని దోచేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు  అన్నారు. ఈరోజు ఆయన పార్టీనేతలతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.
ఇసుక, సిమెంటు,మద్యం,వర్కులు అన్నింటిలో దోపిడి జరుగుతూ ఉందని,  రాష్ట్రంలో వ్యాపారాలు చేయాలంటే, ఆస్తులు అమ్మాలంటే కొత్త రకం ట్యాక్స్ విధిస్తున్నారనం దాని  ‘జె ట్యాక్స్’ (జగన్ టాక్స్) అని చంద్రబాబు నాయుడు అన్నారు.
ఇసుక కృత్రిమ కొరతను వైసిపి నేతలే సృష్టించారని  శాండ్ మాఫియాగా ఏర్పడి దోపిడి చేస్తున్నారని అంటూ  ఆంధ్రప్రదేశ్ అభివృద్దిని విజయవంతంగా అడ్డుకున్నారని చంద్రబాబు అన్నారు.
‘ఇలాంటి కష్టం, ఇంత నష్టం గతంలో ఎపుడూ  లేదు. వీళ్ల ఇసుక దోపిడీ వల్ల 5నెలల్లో 50మంది కార్మికుల ఆత్మహత్యచేసుకున్నారు. దోపిడి బారిన పడి నిర్మాణ రంగ కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్ర చరిత్రలో లేవు,’ అని ఆయన అన్నారు.
పనుల్లేక ఎన్నో కుటుంబాలు పస్తులు ఉంటున్నాయి.అనేకమంది అప్పుల పాలయ్యారు. ఇంత పెద్దఎత్తున ఆత్మహత్యలు ఎపుడయినాజరిగాయా అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
‘కార్మికుల కష్టాల్లో అందరూ అండగా ఉండాలి. కార్మికుల కుటుంబాలకు సంఘీభావంగా చూపాలి.భవన నిర్మాణ కార్మికుల్లో భరోసా పెంచేందుకే రేపు తాను  దీక్ష చేపడుతున్నట్లు ఆయన చెప్పారు.
విజయవాడలో రేపటి తన 12 గంటల నిరసన దీక్ష సక్సెస్ చేయాలనిదీక్షకు  కృష్ణా గుంటూరు జిల్లాలనుంచి పెద్ద ఎత్తున జనాన్ని తరలించాలని  కాన్ఫరెన్స్ పాల్గొన్న ఈ రెండు జిల్లాల నేతలకు పిలుపునిచ్చారు.
వివిధ ప్రాంతాలనుంచి ర్యాలీగా దీక్షకు తరలిరావాలని, కార్మికులకు సంఘీభావంగా ర్యాలీలు జరపాలని నాయుడు అన్నారు.
చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే…
రాష్ట్రంలో తక్షణమే ఇసుక ఉచితంగా ఇవ్వాలి.
సరిహద్దుల్లో నిఘా కట్టుదిట్టం చేయాలి.
పొరుగు రాష్ట్రాలకు ఇసుక అక్రమ రవాణా అడ్డుకోవాలి.
పనులు కోల్పోయినవారికి నెలకు రూ.10 వేలు పరిహారం ఇవ్వాలి.
ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం చెల్లించాలి.
అమరావతిలో స్టార్టప్ ఏరియా డెవలప్ మెంట్ నిలిపేశారు. సింగపూర్ కన్సార్షియంతో ఎంవోయూ రద్దు చేశారు.
ఏపి అభివృద్ధికి ఇది ఊహించని శరాఘాతం. రాష్ట్రానికి ఎక్కడా పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు.
పోలవరం ప్రాజెక్టు పనులు నిలిపేశారు. రాష్ట్రంలో అన్నిప్రాజెక్టుల పనులు ఆపేశారు.
ప్రభుత్వ నిర్వాకాలతో రాష్ట్రానికి తీరని నష్టం. రాష్ట్ర భవిష్యత్తు అంధకారం చేస్తున్నారు. ఇష్టానుసారం చేయడానికి ఇది నిరంకుశత్వం కాదు.
ప్రజాకంటక పార్టీగా వైసిపి మారింది. ప్రజల పట్ల బాధ్యతగల పార్టీ తెలుగుదేశం.
37ఏళ్లుగా టిడిపి పేదలకు అండగా ఉంటోంది. 22ఏళ్ల అధికారంలో రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేసింది.
ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యలపై పోరాడుతోంది. ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారం కోసం కృషి.