భారత్ చేరాక అభినందన్ మాట్లాడిన వీడియో

పాక్ ఆర్మీ చేతిలో నిర్బంధంగా ఉన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ శుక్రవారం సాయంత్రానికి స్వదేశానికి చేరుకున్నారు. పాక్ అధికారులు ఆయన్ని వాఘా సరిహద్దువద్ద భారత్ కు అప్పగించారు. ఆయన రాకకోసం వాఘా సరిహద్దు వద్ద ఎదురుచూస్తున్న జనం అభినందన్ అక్కడికి చేరుకోగానే పెద్ద ఎత్తున నినాదాలు చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

అయితే యావత్ భారతదేశం అభినందన్ ఇండియాకి వచ్చాక ఎలాంటి విషయాలు వెల్లడించవచ్చు అని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ చేరుకున్నాక అభినందన్ మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఆయన పాక్ ఆర్మీ చేతుల్లోకి ఎలా వెళ్లారు, వారు తనని ఎలా ట్రీట్ చేసారో తెలిపారు. ఆ వీడియో కింద ఉంది చూడవచ్చు.

“నేను ల్యాండ్ అయిన ప్లేస్ లో చాలామంది (పాకిస్థానీలు) ఉన్నారు. నా దగ్గర కేవలం ఒక పిస్టల్ మాత్రమే ఉంది. నేను అక్కడ నుండి బయపడటానికి ట్రై చేశాను. పరిగెడుతుంటే వారంతా నన్ను వెంబడించారు. వారు చాలా ఆగ్రహంతో ఉన్నారు. అంతలోనే పాకిస్థాన్ జవాన్లు ఇద్దరు అక్కడికి వచ్చారు. వాళ్ళ కెప్టెన్ కూడా వచ్చారు. స్థానికుల నుండి వీళ్ళే నన్ను కాపాడారు. వారి యూనిట్ కి నన్ను తీసుకెళ్లారు. నాకు ప్రధమ చికిత్స చేసిన అనంతరం హాస్పిటల్ కి తీసుకెళ్లారు. నాకు అక్కడ మెరుగైన చికిత్స అందించారు. పాకిస్తాన్ ఆర్మీ చాలా ప్రొఫెషనల్ గా వ్యవహరించింది. వారిలో నాకు శాంతి కనిపించింది”.

అయితే పాకిస్తాన్ రిలీజ్ చేసిన అభినందన్ వీడియోలో ఆయన పాక్ ఆర్మీని ప్రశంసించారు. ఇండియా వెళ్ళాక కూడా నా స్టేట్మెంట్ వెనక్కి తీసుకోను అన్నారు. చెప్పినట్టే ఆయన మాట మీద నిలబడ్డారు. ఇండియా వచ్చాక కూడా పాక్ ఆర్మీని అదేలా ప్రశంసించడం విశేషం. దీంతో యూత్ అంతా సింహం ఎక్కడున్నా సింహమే. ఇండియా వచ్చాక మాట మార్చలేదు అని అభినందన్ ని అభినందిస్తున్నారు.

మసూద్ అజర్ పై పాకిస్థాన్ మంత్రి సంచలన ప్రకటన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *