హుజూర్ నగర్ లో టిఆర్ ఎస్ ముందంజ, ఇక ఆర్టీసి సమ్మె ఎటువోతుంది?

ఒక వైపు టిఆర్ ఎస్ వర్గాల్లో ఆనందోత్సోహాలు. ఎందుకంటే,హుజూర్ నగర్ ఎన్నికల్లో  ఆ పార్టీ అభ్యర్థి  సైదిరెడ్డి విజయం వైపు దూసుకుపోతున్నాడు, ఈ వార్త రాస్తున్నప్పటికి 5 రౌండులో ఆయన మెజారిటి 1100 దాటింది. హూజూర్ నగర్ గెలవడం అంటే ముఖ్య మంత్రి కెసిఆర్ మాటలకు పదును పెట్టడమే.  మొదటి రియాక్షన్ ఎలా ఉండవచ్చు.

ప్రజలు ఆర్టీసి సమ్మెను తిరస్కరించారని చెప్పవచ్చు. మొత్తానికి హుజూర్ ఎన్నికల్లో తొలినుంచి టిఆర్ ఎస్ మెజారిటితో ఉండటం సమ్మె చేస్తున్న వాళ్లకు, సమ్మెను బలపరుస్తున్న వాళ్లకు  కొద్దిగా ఇబ్బందికరమయిన వాస్తవం.ఇపుడయితే తమక 25వేల మెజరిటీ వస్తుందని  టిఆర్ ఎస్ వాళ్లు బల్ల గుద్దుతున్నారు.

ఇక టిఆర్ ఎస్ అభిమానులు రెచ్చిపోతారు. ఇంకా కౌంటిగ్ పూర్తికాలేదు కాని, కారు స్పీడ్ తగ్గేలా లేదు.

హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాలను ఎన్నిరకాలుగానో ఇంటర్ప్రెట్ చేయవచ్చు. ప్రజలు సమ్మెను తిరస్కరించారనవచ్చు. ప్రజలు కెసిఆర్ విధానాలను సమర్థించారన వచ్చు. ప్రజలు కేసిఆర్ చేతులను బలపర్చారనవచ్చు.

19 రోజులుగా ఆర్టీసి కార్మికులు, ప్రతిపక్షాలు సమ్మె చేస్తుంటే, హూజూర్ నగర్ ప్రజలకు చీమకుట్టినట్లు కూడా లేదంటే సమ్మెలో పస లేదని అనవచ్చు.

ఇవన్నీ కెసియార్ చేతిలో అస్త్రాలే. అసలే ఆయన  మొండిగా ఉన్నారు. ఇక అగరు.

కార్మికుల పక్షాన్నుంచి  హూజూర్ నగర్ ను కన్విన్సింగ్ గా విశ్లేషించడం కష్టమే.  ఎందుకంటే, ఈ ఎన్నికలో టిఆర్ ఎస్ వోడిపోయి ఉంటే కొంత నైతిక బలం ఉండేది. ఇపుడలా కాదు. కాకపోతే, సమ్మెలో ఉండిపోయి, ఉప ఎన్నికను పట్టించుకోలేదని చెప్పవచ్చు.

అటు వైపు సమ్మె 19 రోజులకు చేరింది. ఈ రోజుహైదరాబాద్

మలక్ పేట నల్లగొండ క్రాస్ రోడ్ వద్ద ఆర్టీసీ సమ్మె పై
ప్రభుత్వ వైఖిరి కి నిరసనగా  జనం నిరసన తెలిపారు.  నల్గొండ క్రాస్ రోడ్స్ వద్ద గంటల తరబడి బస్సు కోసం ఎదురు చూస్తున్న సామాన్య జనం ఒక్క బస్సు రాకపోవడం తో కోపోగ్రక్తులైన జనం నడ్డి రోడ్ మీది పరి గెత్తుకుంటూ వచ్చారు. రోడ్డ కు అడ్డంగా నిలబడి  ట్రాఫిక్ నిలిపి రాస్తా రోకో నిర్వహించి, తమ నిరసన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ మరియు ఆర్టీసీల మొండి వైఖిరి వల్ల  సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురైతున్నారని, ఎవరూ పట్టించుకొనక పోతే ఎలా ప్రశ్నించారు. వాపోయారు.

కొద్దిపాటి ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.  నల్గొండ క్రాస్ రోడ్ వద్ద ట్రాఫిక్ కు కొద్ద సేపు అంతరాయం జరిగింది.