తెలంగాణ రెవిన్యూ శాఖలో వీఆర్ వొ అంటే ఎంత పవర్ ఫుల్ అంటే…

గవర్నమెంట్ ఆఫీస్ అంటే  ఒక టార్చర్ ఛేంబర్. అక్కడ కూర్చున్న ప్రతివ్యక్తి అధికారం చలాయించి ప్రజలను వేదింపులకు గురిచేయగలడు.
రెవిన్యూ కార్యాలయం, పోలీసులు స్టేషన్లు, సబ్ రిజిస్టార్ ఆఫీసులు ప్రజలను పీక్కు తినడంలో ముందుంటాయని జనంలో బలంగా నాటుకుపోయిన నమ్మకం.
  అందుకే ఎక్కడైనా ఈ శాఖ ల్లో మంచి వాడు కనబడితే హెడ్ లైన్ అయిపోతుంది.
ఇపుడు విషయమేమిటంటే, రెవిన్యూశాఖలో వీఆర్వో అనేది చాలా చిన్న ఉద్యోగం. కాని ఆ పదవికి ఉన్నఅధికారం ఎంతో తెలిస్తే దిమ్మతిరిగి పోతుంది.
వీఆర్వో అనే వ్యక్తి మరొకరి భూమి కాజేయగలడు,మరొకరికి బదిలీచేయగలడు, మన భూమిని మాయం చేయగలడు.. లంచం ఇచ్చే దాకా పని వాయిదా వేయగలడు, ఇదే మంటే పోలీసులకు కంప్లయింట్ చేయగలడు.
ఇలా ఏమయినా చేయగలడు చిరుద్యోగి విఆర్ వొ. ఇలాంటి వీఆర్వో చెరబడి సతమతమవుతున్న ఒకరైతు గాధ ఒకటి సోషల్ మీడియా లో తిరుగుతూ ఉంది.  ఇది రెవిన్యూ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చక్కగా విరిస్తుంది. ఒక లుక్కేయండి…
మహబూబబాద్ జిల్లా నెల్లీకుదుర్ మండలంలో వీఆర్వోగా పనిచేసే వీఆర్వో రాజిరెడ్డిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని ఒక బాధిత రైతు కోరుతున్నాడు. రైతు పేరు జంగిలి నవీన్. ఇది నిజం నన్నూ ఇలాగే సతాయిస్తున్నాడని బిక్షం అనే మరొక రైతు చెబుతున్నాడు.
 తండ్రి మరణానంతరం ఉద్యోగం రాజిరేడ్డికి  ఇచ్చారు. వీఆర్వోగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి లంచాలకు అలవాటు పడ్డాడు. పలు మార్లు ఉన్నత అధికారుల దృష్టిలో కూడ పడ్డాడు. తనతోటి సింబ్బంది, బందువుల వద్దకుడా లంచం తిసుకుంటున్నాడని పేరుంది.
జంగిలి పుల్లయ్య మరణనంతరం తన మనవడు పేరున ముటేషన్ చేయ్యాలని జంగిలి అంజయ్య  దరఖాస్తు  పేట్టుకున్నాడు. అంజయ్య ఊరి వార్డు మేంబర్.  అడిగినంత లంచం  ఇవ్వకపోవడంతో పని పెండింగులో ఉంచి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని జంగిలి నవీన్ చెబుతున్నాడు. ‘మా నాన్న గ్రామ వార్డు మేంబర్ కాబట్టి ఆయన  మంచితనంతో ఇన్ని రోజులు అగినము. నెలలు గడుస్తున్నా మా పని చేయ్యడం లేదు. మా పరిస్థితే ఇలా ఉంటే చదువురాని వారి గతి ఏలాాా ఉంటుంది. బాధితులం అందరం కలసి కలేక్టర్ కు పిర్యాదు చేస్తున్నాం,’ అని నవీన్ చెబుతున్నాడు.
*నాకు తేలియకుండ నా ఏకరం భూమిని  తోలగించాడు.. అంతేగాక కోత్తగా కోనుగోలు చేసిన ఏకరం భూమిని ముటేసన్ కోసం దరకాస్తు చేసుకుంటే రెండు సార్లు తిరస్కరించాడు.’మీ సేవ‘లో నాకు తేలియకుండ ముటేసన్ అప్లై చేస్తే మీసేవపైనా ఫిర్యాదు చేస్తానని బేదిరిస్తున్నాడని నమ్ముల బిక్షం అనే రైతు చెబుతున్నాడు.  ఏసీబి అధికారులు వెంటనే అతని ఇంటిపై దాడులు నిర్వహించి బాధితులకు న్యాయం చేయగలరని కోరుతున్నామని నవీన్, బిక్షం కోరుతున్నారు.