మావోయిస్టు పార్టీ జోనల్ కమిటీ మెంబర్లు అరెస్ట్

సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు దళ సభ్యులనుఅరెస్ట్ చేశామని చింతపల్లి ఏఎస్పి సతీష్ కుమార్ అన్నారు.
బుధవారం ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ ఆయన ఈ విషయం వెల్లడించారు.
వారి పేర్లు అల్లం నారాయణస్వామి, అలియాస్ దామోదర్, అలియాస్ నందు, అలియాస్ ఆజాద్.  రెండవ వ్యక్తి  గంగి మాది అలియాస్ పూల్ సత్తి. ఆమె నారాయణస్వామి భార్య.
వారిని గూడెంకొత్తవీధి మండలంలోని అద్దరివీధి గ్రామంలో అరెస్ట్ చేశామని ఆయన తెలిపారు.
ఎఎస్ పి అందించిన వివరాలు
నారాయణస్వామి సుమారు 35 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో పని చేస్తున్నారు. అనంతపురం జిల్లా తాటిమర్రి గ్రామ పంచాయతీకి చెందిన ఇతను అనంతపూర్ లో ఆర్ట్స్ కాలేజీలో బీఏ డిగ్రీ చేస్తూ మావోయిస్టు పార్టీకి అనుబంధ సంస్థ అయిన ఆర్ ఎస్ యు లో పని చేశారు.
అప్పట్లోనే 3 ఏళ్లు జైలుశిక్ష అనుభవించిన అనంతరం దళంలోకి వెళ్ళిపోయారు.
ఆయనకు 2002 సంవత్సరంలో గంగి మాది తో వివాహం జరిగింది.
1990 నుంచి 1997 వరకు టైగర్ ప్రాజెక్టు దళం నెంబర్ గా నల్లమల అడవులలో, 1998 నుంచి 2003 వరకు ఏసీఎం గా ఆంధ్ర- ఒడిస్సా ప్రాంతాలలో, 2004 నుంచి 2008 వరకు డి సి ఎం గా ఆంధ్ర-ఒడిశా లలో, 2009 నుంచి నేటి వరకు ఎస్ జెడ్ సి మెంబర్ గా పని చేశాడు.
1997 ఏడాదిలో మండలంలోని లోతుగెడ్డ బ్రిడ్జి వద్ద మావోయిస్టుల తో కలిసి మందుపాతర పేల్చిన సంఘటనలోను,1998 ఏడాదిలో తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం పోలీస్స్టేషన్ పై దాడీ, 2000 ఏడాదిలో గూడెంకొత్తవీధి మండలం దారకొండ ఆర్ముడు అవుట్ పోస్ట్ పై, 2001 ఏడాదిలో ఒడిషాలోని కలిమేళ పోలీస్ స్టేషన్ పై దాడి, 2002 ఏడాదిలో అనకాపల్లి, చోడవరం పోలీస్ స్టేషన్ల పై దాడి, 2004 ఏడాదిలో ఒరిస్సాలోని కోరాపుట్ ఆర్ముడు కేంద్ర బలగాల పై దాడి ఈ సంఘటనలో బెల్లం నారాయణస్వామి పాల్గొన్నారన్నారు.
ఈ నేరాల తో పాటు ఏవోబీలో ఒరిస్సా, తూర్పుగోదావరి, విశాఖ జిల్లా ఏరియా లో సుమారు 100 పైగా మావోయిస్టులు జరిపిన దాడిలో ఇతను పాల్గొన్నారు.
ఇతనిపై రూ. 20 లక్షలు ప్రభుత్వ రివార్డు ఉందన్నారు.
అదే మాదిరిగా ఇతని భార్య ఒరిస్సాలోని మల్కనగిరి జిల్లాలోని కళిమేల బ్లాక్ గుమాక గ్రామ పంచాయతీకి చెందిన గంగి మాది అలియాస్ పూల్ బత్తి సిపిఐ మావోయిస్టు ఏసీఎంగా కళిమేల దళంలో సుమారు 23 ఏళ్లుగా ఏవోబీలో పని చేసింది.
2008 ఏడాదిలో మల్కనగిరి జిల్లా తెల్లరాయి గ్రామం కళిమేల ప్రాంతంలో పోలీసులపై ల్యాండ్ మైనింగ్ తెలిసిన సంఘటనలో, 2010 ఏడాదిలో ఒడిషాలోని దుక్కిలంక, రాజులకొండ వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో సంఘటనలో ఈమె పాల్గొన్నారు.
ఈమెపై ఆంధ్రా ఒడిశా లో కేసులు ఉన్నాయన్నారు. ఈమెపై ప్రభుత్వం రూ. 6 లక్షలు రివార్డు ప్రకటించింది.