గెల్చి కష్టాలు పడలేను, అందుకే టిడిపికి, అసెంబ్లీకి రాజీనామా: వల్లభనేని వంశీ

అంతా అనుమానించిందే జరిగింది. గన్నవరం టిడిపి ఎంపి వల్లభనేని వంశీ రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేస్తారనే దాని మీద ఎవరికీ అనుమానాల్లేవు గాని, తెలుగుదేశం వదిలేసి ఎటొవోతాడానే దాని మీదే అనుమానాలుండేవి.

అదే చర్చనీయాంశంగా ఉండింది. మొన్నామధ్య కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కలిసినపుడు ఆయన బిజెపికిలోకి వెళతాడనుకున్నారు.

నిన్న ముఖ్యమంత్రి జగన్ ను కలిసినపుడు ఆయన వెళ్లేది బిజెపిలోకి కాాదు, వైసిపిలోకి అనే చర్చ మొదలయింది.

పార్టీ మారాలనుకునే వాడు, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలోకి పోతే చేసేదేముంటుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలో చేరితే నియోజకవర్గానికి, ప్రజలకు ‘ సేవ ’ చేయవచ్చు.

చరిత్ర పోడవునా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు  పార్టీలు మారి చేసింది, స్టేట్ రూలింగ్ పార్టీలో చేరడమే.

ఈ ట్రెండ్ ప్రకారం, వంశీ వైసిపిలో చేరబోతున్నారని ఇపుడు  బాగా ప్రచారం వూపందుకుంది. అయితే, ఆయనుంచి ఎలాంటి సంకేతాలు వెలవడలేదు. ఈ సస్పెన్స్ ఆయన ఇంకా కొనసాగించాలనుకుంటున్నారు.

 మొత్తానికి ఆయన ఒకడుగు ముందుకేసి టిడీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి  రాజీనామా చేశారు.

ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబుకు తన రాజీనామా లేఖను రాస్తూ ఎన్నికల్లో గెల్చి తాను పడుతున్న కష్టాలను వివరించారు. తనను వేధిస్తున్నారని బాధపడ్డారు.

కాకపోతే,  రాజకీయాలకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు బాబుకు రాసిన లేఖలో చెప్పారు. వైసిపి కక్ష సాధింపు దోరణి వల్లే తాను రాజకీయాలనుంచి కొద్ది రోజులు వైదొలగాలనుకుంటున్నట్లు  లేఖ లో రాయడమే వింతగా ఉంది.

వంశీ లేఖ లో ఏం రాశారంటే…

‘ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేందుకు రెండు సార్లు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు. ప్రజలకు ఇచ్చిన హామీలను టీడీపీ హయాంలో ఎక్కువగా నెరవేర్చాను. నియోజకవర్గ అభివృద్ధిలో కూడా పాల్గొన్నాను. గత ఎన్నికల్లో అతికష్టం మీద గెలవాల్సి వచ్చింది. స్థానికంగా ఉన్న వైసీపీ నేతలు, కొందరు ఉద్యోగులు నాకు వ్యతిరేకంగా కుట్ర పన్నారు. అయినప్పటికీ నేను ఎన్నికల్లో గెలుపొందాను. ఎన్నికల తర్వాత అనేక సమస్యలు నన్ను చుట్టుముట్టాయి. రాజకీయంగా నన్ను వేధిస్తున్నారు. అనుచరులపై కేసులు పెడుతున్నారు. అనుచరులను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకనే నేను రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాను’ అని వల్లభనేని వంశీ లేఖలో రాసుకొచ్చారు.

ఈ కారణాలతో శాసనసభ సభ్యత్వానికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వంశీ చెప్పారు.

దీనికి టిడిపి అధినేత చంద్రబాబు సందన ఏంటంటే…

 

వైయస్ఆర్సిపి నాయకులు మరియు కొంతమంది ప్రభుత్వం అధికారుల వల్ల రాజీనామా చేయడం సరికాదు

నాడు మన ప్రభుత్వం పేద, బలహీన, బలహీన వర్గాలకు అనుకూలంగా వ్యవహరించింది.

ఈ విషయంలో, మీరు రాజకీయాలను విడిచిపెడితే, వైసిపి ప్రతీకార రాజకీయ చర్యలను ఆపలేరు

రాజకీయాలకు రాజీనామా చేయడంలో లేదా నిష్క్రమించడం సరైన పరిష్కారం కాదని నా అభిప్రాయం.

ప్రస్తుత ప్రభుత్వ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలి.

ఈ పోరాటంలో నా వ్యక్తిగత తరపున, పార్టీ తరపున మేము మీకు అండగా నిలబడతాం

రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులను ప్రస్తుత ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా వేధిస్తోంది.

మేము ఈ వేధింపులను ఐక్యంగా పోరాడతాం..‌ క్యాడర్ కు అండగా నిలబడతాం