రెండు గంటలే మిగిలింది…. ఆర్టీసీ కార్మికులకు కెసిఆర్ డెడ్ లైన్

ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ ఇప్పటికే 5000 రూట్లలో ప్రైవేటు బస్సులకు అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం గడువు లోగా విధుల్లో చేరకపోతే మిగతా రూట్లలో కూడా ప్రైవేటీకరణ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే రేపటి ముఖ్యమంత్రి నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి.
ఈ రోజు ఆర్థరాత్రితో ముఖ్యమంత్రి కెసిఆర్ విధుల్లో చేరేందుకు ఆర్టీ సి కార్మికులకు ప్రకటించిన గడువు ముస్తుంది.ఈ డెడ్ లైన్ కౌంట్ డౌన్ మొదలయింది. రెండు గంటలే ఉంది. అయితే, ఇక్కడొక, ఇది కెసిఆర్ పెట్టిన రెండోడెడ్ లైన్
గడువు దాటితే ఆర్టీసీ ఉండదా!
5 వ తేదీ అర్థరాత్రి గడువు ముగిసేసరికి చేరకుంటే ఆ తెల్లారో, మర్నాడో మిగతా ఐదు వేల రూట్లకు పర్మిట్లు ఇచ్చే ప్రక్రియ ప్రారంభిస్తుంది. అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఆర్టీసీ రహిత రాష్ట్రంగా మారుతుంది. ఈ పరిస్థితికి ముమ్మాటికీ కార్మికులే కారణమవుతారు ఆర్టీసి యాజమాన్యం చెబుతూ ఉంది.
అయితే, డెడ్ లైన్ పెట్టి, దాన్నెవరైనా పాటించక దుకాణం మూసేయవచ్చా డెమోక్రసీలో అనేది ప్రశ్న. కోర్టులు, కార్మిక చట్టాలు ఏవీ ఉండవా?
  ఒకటి మాత్రం నిజం, గడువు దాటాకా ముఖ్యమంత్రి కెసిఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారో అని చాలా మంది బడుగు జీవులైనా ఆర్టీసి కార్మికుల్లో భయాందోళనలున్నాయి, ఇలాగే వీళ్లు ఇంతగా మెండికేయడం వెనక ప్రభుత్వ ఏమీ చేయలేదనే ధైర్యమేనా అనే బెణుకు ప్రభుత్వంలోనూ  కనిపిస్తూంది.
పాము మనిషి ఎదురు బడితే ఏమవుతుంది?  పామూ భయపడుతుంది, మనిషీ భయపడతాడు… ఇలా ఉంది ప్రభుత్వం ఆర్టీ సి ల వైఖరి