దేవాలయాలకు వెళ్లాలనుకుంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి

 జూన్ 8 తేదీనుంచి ఆంధ్రప్రదేశ్ లో ఆలయాలు తెరచుకోబోతున్నాయి. ప్రజల ఎప్పటిలాగే దైవదర్శనం కోసం బయలు దేరతారు. అయితే, చుట్టూర కరోనా వాతావరణం ఇంకా ముసురుకునే ఉంది. అందువల్ల   ఆలయాలు, పుణ్యక్షేత్రాలు, ప్రార్థనా స్థలాలకు వెళ్లాలనుకునే వారు కరోనా గురించి కచ్చితంగా నిర్ణయాలు పాటించాలి. ఆలయాల దగ్గిర అధికారులు ఈ విషయంలో భక్తుల మీద నిఘా వేసి ఉంచినా సరే, భక్తులు కూడా జాగత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఈ జాగ్రత్త లేమిటో  డాక్టర్ అర్జా శ్రీకాంత్, కోవిడ్-19 స్టేట్ నోడల్ ఆఫీసర్, వివరిసున్నారు.
కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా రెండు నెలల నుంచి లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. లాక్‌డౌన్‌ 5.0 జూన్ 30 వరకు కొనసాగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక సడలింపులు ఇచ్చింది.
ఇందులో భాగంగా ఈనెల 8 నుంచి పుణ్యక్షేత్రాలు, ఆలయాలు, ప్రార్థనా మందిరాలు తిరిగి తెరుచుకోనున్నాయి.
ఈ నేపథ్యంలో ఆలయాలు, ప్రార్థనా మందిరాలు, షాపింగ్ మాల్స్, హోటల్స్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నదానిపై కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఒకవేళ ఆలయాలు, ప్రార్థనా సంస్థలు కంటెయిన్‌మెంట్‌ జోన్లలో ఉంటే మూసే ఉంచాలని స్పష్టం చేసింది.
* 65 ఏళ్లకు పైబడిన వయసువారు, ఇతరత్రా రుగ్మతలు ఉన్నవారు, గర్భిణీలు, 10 ఏళ్లలోపు పిల్లలు ప్రార్థనాలయాలకు ఆలయాలకు వెళ్లకపోవడం మంచిది.
ఇందుకు అనుగుణంగా ఆలయాలను పర్యవేక్షించే సంస్థలు భక్తులకు సూచనలు ఇవ్వాలి.
* భక్తులు దర్శనం కోసం క్యూలైన్ లో ఉన్నపుడు కనీసం ఆరడుగుల భౌతికదూరం తప్పకుండా పాటించాలి. ఇందుకు సంబంధించి ప్రార్థనాస్థలాల నిర్వాహకులు చర్యలు తీసుకోవాలి.
* ఫేస్ కవర్స్ లేదా మాస్కులు ఉన్నవారిని మాత్రమే లోనికి అనుమతించాలి.
* వీలైనంత వరకూ సబ్బుతోగానీ (40 నుంచి 60 సెకన్లపాటు), శానిటైజర్ (కనీసం 20 సెకన్లు) తోగానీ చేతులను అవకాశం ఉన్నపుడల్లా శుభ్రం చేసుకుంటూ ఉండాలి.
* దగ్గు, తమ్ములు వచ్చినపుడు తప్పనిసరిగా మోచేతలను అడ్డుపెట్టుకోవడం లేదా కర్చీఫ్, టిష్యూ పేపర్ ను ఉపయోగించాలి. టిష్యూ పేపర్ ను పారవేయడంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
* భక్తులు ఎప్పటికప్పుడు తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి అనారోగ్యకరమైన లక్షణాలు కనిపించినా వెంటనే జిల్లా హెల్ప్ లైన్ నంబర్ కు కాల్ చేయాలి.
* ఆలయ పరిసరప్రాంతాల్లో, చుట్టుపక్కల ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని ఖచ్చితంగా నిషేధించాలి.
* భక్తులందరికీ ఆరోగ్యసేతు యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించాలి.
అన్ని మతపరమైన ప్రాంతాల్లో ఈ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి:
* ప్రవేశ ద్వారాల వద్ద శానిటైజర్లు, థర్మల్‌ స్కానర్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.
* దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు లేనివారినే దర్శనానికి అనుమతించాలి.
* మాస్కులు ధరించి ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతించాలి
* కోవిడ్-19 గురించి, నివారణ చర్యలకు సంబంధించిన పోస్టర్లు/ స్టాండీలు ఏర్పాటు చేయాలి. వైరస్ పై ప్రజలకు మరింత అవగాహన కల్పించేలా ఆడియో, వీడియో క్లిప్ లు ప్రదర్శించే ఏర్పాట్లు చేయాలి.
* భక్తులు వీలైనంత వరకు తమ పాదరక్షలను వాహనాల్లోనే వదిలి వెళ్లాలి. మరీ అవసరమైతే .
ప్రతి వ్యక్తి / కుటుంబ సభ్యుల వరకు ప్రత్యేక స్టాళ్లలో ఉంచాలి.
* పార్కింగ్‌ ప్రదేశం లోపల, బయట ఎక్కువ మంది గుమికూడి ఉండకూడదు. అక్కడ తప్పనిసరిగా భౌతిక దూరం పాటించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి.
* షాపులు, స్టాల్స్, కేఫ్ లుతమ పరిసరాల్లో భక్తులు భౌతిక దూరం పాటించేందుకు చర్యలు తీసుకోవాలి.
ఇందుకోసం క్యూలైన్ ద్వారా ఆ పరిసరాల్లో భౌతికదూరం పాటించేలా మార్కింగ్స్ వేయాలి.
* లోపలికి వెళ్లడానికి, బయటకు రావడానికి ప్రత్యేక గేట్ లు ఉండేలా చూసుకోవాలి.
* లోపలికి వచ్చేటప్పుడు కనీసం 6 అడుగుల దూరం ఉంటూ క్యూలైన్ లో వెళ్లాలి.
* లోపలికి వెళ్లేసమయంలోనే సబ్బు లేదా శానిటైజర్ తో చేతులు, కాళ్లు కడుక్కోవాలి.
* ఆలయంలో దేవతామూర్తులను, ఇతర ప్రార్థనా స్థలాల్లో పవిత్ర గ్రంథాలను తాకకూడదు.
* ప్రార్థనాలయాల దగ్గర ప్రసాదాలు/ పవిత్ర జలాలను చల్లడం, సామూహిక వంటశాలలు, అన్నదానాల వద్ద భౌతిక దూరం పాటించాలి.
* ప్రార్థనాలయాల పరిసరాల్లో పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, నీటి కుళాయిలు, కాళ్లు కడుక్కునే ప్రాంతాలవద్ద ప్రత్యేక దృష్టిసారించాలి.
* ఆలయాల్లోని వివిధ అంతస్తులను (ఫ్లోర్స్), పరిసర ప్రాంతాలను తరచూ శుభ్ర చేయడం, క్రిమిహారకం చేయడం తప్పనిసరి.
* భక్తులు, సందర్శకులు వదిలి వెళ్లిన ఫేస్ కవర్లు, మాస్కులు, చేతి కవర్లను సరైన పద్దతిలో పారవేయడానికి ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాలి.
ఒకవేళ ఆలయ, మతపరమైన, ప్రార్థనా ప్రదేశాల్లో అనుమానితుడు లేదా ధృవీకరించబడిన కేసు విషయంలో:
* అనుమానిత లక్షణాలు వుండే వ్యక్తి ఉన్న గదిలో ఉండే వ్యక్తుల నుంచి వేరు చేసి వెంటనే ప్రత్యేక ప్రదేశంలో ఉంచాలి.
అతను/ ఆమెను డాక్టర్ పరీక్షించే వరకు మాస్కు/ ఫేస్ కవర్ ఇవ్వండి
* వెంటనే స్థానికంగా ఉండే వైద్య సిబ్బందికి లేదా జిల్లా, రాష్ట్రస్థాయి హెల్ప్ లైన్ కు కాల్ చేయాలి
* వెంటనే వైద్యశాఖ నియమించిన సిబ్బంది అప్రమత్తమై తదుపరి చర్యలకు సిద్ధమవుతారు. అతని / ఆమెతో దగ్గరగా ఉన్నవారి పరిచయాలను గుర్తించడంలో నిమగ్నమవుతారు.
* ఒకవేళ అతడు/ఆమె కోవిడ్-19 పాజిటివ్ కేసుగా నిర్ధారించబడితే వెంటనే ఆప్రాంతాన్ని క్రిమిసంహారకం చేయాలి.