తెలుగు రాష్ట్రాల ఆరోగ్యం ఏమీ బాలేదు, ఫుల్ రెవిన్యూ డెఫిసిట్

రెండు తెలుగు రాష్ట్రాల ఖర్చులు  కట్లు తెంచుకుని దూసుకుపోయాయి. ఖర్చులకు తగ్గ రాబడి లేకపోవపోవడం వ్యవహారం లోటులోపడిపోయింది. ఈ విషయంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ కంటే కొంచెం మెరుగ్గా కనిపించినా,  రెండు రాష్ట్రాల వచ్చే బడ్జెట్ లలో చాలా కోతలుండవచ్చనుకుంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ కు బాగా ఆర్థిక సమస్యలు ఎదుర్కోవచ్చు. ఎందుకంటే,  ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి విశాఖకు మారిపోతున్నది.
రెండు రాష్ట్రాల ఆర్థికపరిస్థితి మీద దెక్కన్ క్రానికల్ ఒక ఆసక్తి కరమయిన కథనమొకటి ప్రచురించింది.  ఈ ఏడాది బడ్జెట్ ప్రవేశపెడుతున్నపుడు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం రెవిన్యూలోటు రు. 2,044 కోట్లు మించదనుకున్నారు. అయితే ఈ డిసెంబర్ నాటికి ఇది రు. 3,573 కోట్లకు చేరుకుంది.
ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ డిఫిసిట్ రు. 1,773 కోట్లు మించదని భావించింది. అయితే, ఇది డిసెంబర్ నాటికి అమాంతం పెరిగి రు.25,000 (అక్షరాల ఇవరై అయిదువేలు)కోట్లకు చేరకుంది.
దీనితో రెండు రాష్ట్రాలు పైకి గంభీరంగా ఉన్నా లోన బాగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. రెండు రాష్ట్రాలబిల్లు చెల్లింపును వాయిదావేసుకున్నాయి. బిల్లులు చెల్లించాలంటే ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాల్సిందేనని షరతు పెట్టాయి.
తెలంగాణకు సంబంధించి, డిసెంబర్ నాటికి రాష్ట్రానికి జమఅయిన నిధులు రు.61,862.58 కోట్లు.   ఖర్లు రు.65,435.57 కోట్లు. లోటు రు.3,572.99 కోట్లు.
ఇక ఆంధ్రకు సంబంధించి వసూళ్లు రు.63,750.41 కోట్లు. ఖర్చులు రు.88,891.71 కోట్లు. లోటు రు.25,141.30 లు
తెలంగాణ ప్రభుత్వానికి 54.70 శాతం వసూళ్లుంటే, ఆంధ్రలో సాధించింది కేవలం 35.68 శాతం మాత్రమే.
ఆంధ్రలో వసూళ్లు పడిపోయేందుకు కారణం, అక్కడ మద్య పాన నిషేధం అమలుఅవుతూ ఉండటం ఒక కారణమని చెబుతున్నారు. బడ్జెట్ ప్రవేశపెడుతున్నపుడు లిక్కర్ నుంచి అదాయం రు.8,518 కోట్లదాకా ఉంటుందని  భావించారు. డిసెంబర్ చివరి నాటికి లిక్కర్ సేల్స్ వల్ల వసూలయింది కేవలం రు. 3,341.15 కోట్ల (39.22శాతం) మాత్రమే.
తెలంగాణలో లిక్కర్ వల్ల రు. 10,901 కోట్ల వస్తాయనుకున్నారు. అయితే, డిసెంబర్ నాటికి రు. 7,454.47 కోట్లు మాత్రమేవసూలయింది.
దీనితో రెండు రాష్ట్రాలు బడ్జెట్ అంచనా సవరించుకోవలసి రావచ్చు. దీని ప్రభావం వచ్చే బడ్జెట్ మీద పడనుంది.