తెలంగాణ లిటరరీ ఫెస్టివల్, అందరికీ ఆహ్వానం

తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ‘లిటరరీ ఫెస్ట్’ నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో
ఈనెల 14,15,16వ తేదీలలో బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే ఈ ఫెస్ట్ లో పలువురు సాహితీ ప్రముఖులు పాల్గొంటున్నారు.
వందమందికి పైగా ఉన్న మన తెలుగు సాహితీకారుల సాహిత్యం-జీవితం ఆవిష్కృతమయ్యేలా పరిశోధక విద్యార్థులు రాసిన వ్యాసాల సంకలనంతెలుగెత్తి జైకొట్టు’ పేరుతో ఆవిష్కరించనున్నారు.
తెలుగు భాషలో జరిగిన, జరుగుతున్న సాహితీ సృజనను నేటి తరానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో జరిగే ఫెస్ట్ లో పరిశోధక విద్యార్థులతోపాటు డిగ్రీ స్థాయి విద్యార్థులు, సాహితీవేత్తలు నాలుగు వందల మందికి పైగా పాల్గొంటున్నారు. మూడురోజులూ సమకాలీన అంశాలు, చారిత్రక అంశాలపై సెషన్ల వారీగా చర్చలు, ప్రసంగాలు ఉంటాయి. వీటితోపాటు కవి సమ్మేళనాలు, సీనియర్ కవులు, రచయితలకు సన్మానాలు, ఆటపాటలు ఉంటాయి.