అమరావతి పోలీసుల దాడులపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు

అమరావతి  ప్రాంతంలో రాజధానితరలింపునకు వ్యతిరేకంగా  ఉద్యమిస్తున్న మహిళల మీద పోలీసులు జరిపిన ‘దాడి’ గురించి విచారణ జరిపేందుకు  విజయవాడ వచ్చిన జాతీయ మహిళా కమిషన్ సభ్యులని  టీడీపీ ఎంపీలు గల్లా జయ్ దేవ్, పార్టీ నేతలు పంచుమర్తి అనురాధ,గద్దె అనురాధ,దివ్యవాని కలిశారు.
అమరావతి లో జరిగిన ఘటనల మీద  వారు జాతీయ మహిళ కమిషన్ బృందానికి అన్ని సాక్ష్యాధారాలతో వివరించారు.
26 రోజులుగా రాజధాని లో జరుగుతున్న ఆందోళనల గురించి జాతీయ మహిళా కమిషన్ సబ్యులకు తెలిపామని, సెక్షన్ 144 అడ్డం పెట్టుకుని పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు వివరించమాని టిడిపి ఎంపి గల్లా జయదేవ్ తెలిపారు. ఇదే విధంగా మీడియా పై పోలీసులు ఎలా దురుసుగా వ్యవహరిస్తున్నారో కూడా తెలిపామని   ఆయన చెప్పారు. ఈ రోజు తాము ఇచ్చిన అన్ని ఆధారాలను ఢిల్లీకి తీసుకువెళ్లి ఛైర్మన్ కి చూపించి న్యాయం జరిగేలా చేస్తాం అని కమిషన్ సభ్యులు హామీ ఇచ్చారు.
పంచుమర్తి అనురాధ,మాజీ జడ్పీ చైర్మన్  గద్దె అనురాధ,దివ్యవాణి మాట్లాడుతూ మహిళల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఫోటో లతో సహా అన్ని ఆధారాలను జాతీయ మహిళా కమిషన్ అందించామని తెలిపారు.
పోలీసుల దాడిలో గాయడపిన మహిళలు దాహం దాహం అని అడుగుతున్నా పోలీసులకు జాలి చూపలేదని,చావు బతుకుల మధ్య ఉన్నా పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని తాము  జాతీయ మహిళా కమిషన్ సభ్యులకు తెలిపామని, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని చెప్పారు.