ఇంటర్నెట్ ప్రాథమిక హక్కు, హరించరాదు: కాశ్మీర్ మీద సుప్రీంకోర్టు వ్యాఖ్య

కాశ్మీర్ పరిణామాలమీద సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంటర్నెట్ అంటే వాక్ స్వాతంత్య్రం అని పేర్కొంది.
ఇంటర్నెట్ అంటే భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రం అని సుప్రీంకోర్టుప్రకటిచింది. రవాణా,కమ్యూనికేషన్ల మీద కాశ్మీర్ లో ఆంక్షలను విధించడాన్ని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ల మీద సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ ఈ వ్యాఖ్యాలు చేసింది.
ఆగస్టు 5 నుంచి జమ్ము కాశ్మీర్ లో ఈ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ పిటిషన్ ను కాశ్మీర్ టైమ్స్ ఎడిటర్ అనూరాధ భసీన్ వేశారు.ఇంటర్నెట్ మీద విధించిన ఆంక్షలతో పాటు 144 సెక్షన్ విధించడాన్ని కూడా కాశ్మీర్ ప్రభుత్వం వారం రోజుల్లో సమీక్షించాలని ఆదేశించింది. అదే భవిష్యత్తు  ఇచ్చే ఉత్తర్వులను కూడా ఒక గడువు లోపు సమీక్షించాలని ఆదేశించింది.
అంతేకాదు, నిరసన వ్యక్తీకరణను అణచేసేందుకు సెక్టన్ 144 ను ఒక ఆయుధంగా వాడేందుకు వీల్లేదని కూడా కోర్టు వ్యాఖ్యానించింది.
144 వ సెక్షన్ విధిస్తున్నట్లు, ఇంటర్నెట్ ను మూసేస్తున్నట్లు ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం ఎక్కడా ప్రచురించలేదు. ఇది తప్పు. అన్ని ఉత్వర్వులను ప్రభుత్వం ప్రచురించాలి. అపుడు ఈ ఉత్తర్వులను పౌరులు కోర్టులో సవాల్ చేసేందుకు వీలవుతుందిన కూడాకోర్టు వ్యాఖ్యానించింది.
ఇంటర్నెట్ అంటే సమాచార వ్యవస్థలో ప్రధానాంశం. ఇది భావప్రకటనా స్వేచ్ఛ కిందికి వస్తుంది. అందువల్లఇంటర్నెట్ రాజ్యంగం ఆర్టికిల్ 19 (1) (a), 19(1) (g) కింద దీనికి రక్షణ ఉంది.కాశ్మీర్ లో విధించిన ఆంక్షలు ఈ రాజ్యంగ నియమాలకు అనుకూలంగా ఉండాలని జస్టిస్ ఎన్ వి రమణ, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జస్టిస్ బిఆర్ గవాయ్ ల ధర్మాసనం పేర్కొంది.

Internet is a major means of information therefore Freedom of Expression through internt is part of Article 1991( and restrictions on it should be in accordence with restrictions to this right : Supreme Court

ఇంటర్నెట్ అనేది వాక్ స్వాతంత్య్రంలో ప్రధానాంశం. ఇది పౌరుల ప్రాథమిక హక్కు.
అందువల్ల ఇంటర్నెట్ ప్రాధాన్యాన్ని తక్కువ అంచనా వేయరాదు. స్వేచ్ఛ భద్రతలు అనేవి ఎపుడూ వైరు ధ్యం తోనే ఉన్నాయి, పౌరులందరికి భ్రదతతో పాటు ప్రాథమిక హక్కులు కూడా అందేలా చూడటమే కోర్టు పని అని ధర్మాసనం పేర్కొంది.
పౌరులు ఉద్యోగం చేసేందుకు ఇంటర్నెట్ ఒకసాధనమని, అందువల్ల దీనిని హరించడానికి వీల్లేదని కోర్టు పేర్కొనడం విశేషం.