భారతీయుల అమెరికా కల చెదిరింది, వలసలు పడిపోయాయ్

భారతీయుల అమెరికా కల మీద ట్రంప్ నీళ్లు పోశాడు.ఇండియన్ల అమెరికా డ్రీమ్ చెదరిపోతున్నది.
అమెరికాకు వెళ్లిపోదామనుకుంటున్న భారతీయుల సంఖ్య బాగా తగ్గిపోయింది.
అమెరికాప్రభుత్వం వీసా నియమాలను గట్టిగా బిగించేయడంతో 2018లో అమెరికాకు మకాం మార్చాలనుకుంటున్నవారి సంఖ్య 7.3 శాతం పడిపోయిందని నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ (National Foundation for American Policy: NFAP ) వెల్లడించింది. డోనాల్డ్ ట్రంఫ్ అమెరికా అధ్యక్షుడయ్యాక భారతీయులకు ఇచ్చే వీసా నియమాలను బాగా కఠినతరం చేశారు.
ఇకగ్రీన్ కార్డు మీద వెళ్లే వారి సంఖ్య కూడా 216-2018 మధ్య 7.5 శాతం తగ్గింది. NFAP విశ్లేషణ ప్రకారం తగ్గింపు కారణం అమెరికావెళ్లే వివాహితుల సంఖ్య పడిపోవడమే.సాధారణంగా భార్య భర్తల్లో ఒకరికి అమెరికా వెళ్లే అవకాశం వస్తే తర్వాత భార్య,భర్త,పిల్లలు,తల్లితండ్రులు అమెరికా వలస వెళ్లేందుకు వీలయ్యేది. ఇపుడు అసలు ఒకరు కూడా వెళ్లడం కష్టం కావడంతో వారి అధార పడిన వాళ్లెవరూ అమెరికా వెళ్లేందుకు అవకాశం రావడం లేదు.
అమెరికా దౌత్యకార్యాలయాలో వీసా మంజూరు నియమాలను కఠినంగా అమలు చేస్తూండటమే కారణం. దీనితో చాలా మంది వీసా దరఖాస్తులను తిరస్కరించడం, మంజూరీకి బాగా టైంతీసుకోవడం జరుగుతూ ఉందని ఈ సంస్థ పేర్కొంది.
2016- 2018 మధ్య గ్రీన్ కార్డు జారీ చేయడం కూడా తగ్గిపోయింది. 2016లో 64687 మందికి గ్రీన్ కార్డులొస్తే 2018లో 59,821 మందికి మాత్రమే వచ్చాయి. దీనితో గ్రీన్ కార్డు హోల్డర్ సమీప బంధువులు అమెరికా వలసరావడం ఆగిపోయింది.
ఇలా సమీప బంధువుల క్యాటగరీలో అమెరికాకు మకాం మార్చాలనుకునే వారి సంఖ్య 14.8 శాతం తగ్గింది. గ్రీన్ కార్డుతో అమెరికాలో పర్మనెంట్ రెసిడెంట్ స్టేటస్ హోదా పొందినవారి సంఖ్య 1,193,505 (2016) నుంచి 1,096,611 కు పడిపోయింది. అంటే 86,894 మంది తగ్గిపోయారు. ఇది 7.3 శాతం అని ఈ సంస్థ పేర్కొంది.