జిఎన్ రావు కమిటీకి చేరిన రాయలసీమ ప్రతిపాదనలు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరిగే విధంగా చేపట్టవలసిన అంశాలపై  జి ఎన్ రావు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేయడాన్ని ఆహ్వానిస్తున్నాం.
సుస్థిర రాష్టాలు ఏర్పాటుకు అభివృద్ధి వికేంద్రీకరణ అత్యంత కీలకమైన అంశాలని మన చారిత్రిక అంశాలు రుజువు చేసాయి. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి జరగాలన్న లక్ష్యంతోనే శ్రీబాగ్ ఒడంబడిక జరిగింది.
సాగునీటి వసతులు కల్పనలో వెనుకబడిన రాయలసీమకు ప్రధమ ప్రాధాన్యత, రాజదాని/ హైకోర్టు రాయలసీమలో ఏర్పాటు, శాసన సభలో రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు కోస్తా జల్లాలతో సమానంగా శాసనసభలో ప్రాతినిధ్యం ఉండాలన్నవి ఈ ఒడంబడిక లో ప్రధాన అంశాలు. కాని ఈ ఒడంబడిక ను అమలు పరచక పోవడంతో రాయలసీమ మరింత వెనుకబాటుకు గురైంది.
అభివృద్ధి అంతా హైదరాబాద్ లోనే జరిగింది, ఉద్యోగ అవకాశాలు అన్ని అక్కడే జరిగాయి అన్న నేపథ్యంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర ఉద్యమం జరిగింది.
ఈ సందర్భంగా అనేక రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అభివృద్ధి వికేంద్రీకరణ జరిగి ఉండాల్సిందన్న ఆకాంక్షను వ్యక్త వరిచాయి. కాని తెలంగాణ విడిపోయిన తరువాత పాలకులు అభివృద్ధి కేంద్రీకరణ చేస్తూ గతంలో జరిగిన తప్పులనే పునరావృతం చేసి వెనుకబడిన ప్రాంతాలకు తీవ్ర అన్యాయం చేశారు.
ఈ నేపథ్యంలో రాయలసీమ అభివృద్ధికి చేపట్టవలసిన సాగునీటి ప్రాజెక్టులు, రాజదాని/ హైకోర్టు రాయలసీమలో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలను ఎక్స్ పర్ట్ కమిటీకి పంపించాం.
ఇదే విధంగా రాష్ట్ర స్థాయి కార్యాలయాలను రాయలసీమలో ఏర్పాటు, చెరువుల అభివృద్ధికి ప్రత్యేక సాగునీటి కమీషన్, జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం, కృష్ణా నది యాజమాన్య బోర్డు, యువతకు ఉద్యోగావకాశాలు, కడప ఉక్కు, గుంతకల్లు రైల్వే జోన్, కర్నూలులో సీడ్ హబ్, అనంతపురం లో AIMS, మన్నవరంలో BHEL, NTPC, లేపాక్షి నాలెడ్జ్ హబ్ ను IT హబ్ గా, కర్నూలు జిల్లా లో సీడ్ హబ్ , పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు అంశాల పట్ల సవవిరణమైన ప్రతిపాదనలు జి ఎన్ రావు గారి ఆధ్వర్యంలోని ఎక్స్పర్ట్ కమిటికి రాయలసీమ సాగునీటి సాధన సమితి పంపడమైనది.
-బొజ్జా దశరథ రామి రెడ్డి,అధ్యక్షులు,రాయలసీమ సాగునీటి సాధన సమితి