రాయలసీమలో రాజధాని, హైకోర్ట్ ఏర్పాటు చేయాల్సిందే: ఆదోని సభ డిమాండ్

రాయలసీమలో రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ ఆదోని మున్సిపల్ మైదానంలో రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది.
సభలో జెఎసి నేతలు రవికుమార్, భరత్ కుమార్, రంగముని నాయుడు, నల్లన్న, ఎద్దుపెంట అంజీ, సాయి ప్రసాద్, సునీల్ రెడ్డి, రామాంజీ, తేజ, శ్రీరాములు, జీవన్ సింగ్, లాయర్ నాగేంద్ర,చంద్రప్ప,గిరిధర్, దేవరాజ్, నక్కలమిట్ట శ్రీనివాసులు, రామక్రిష్ణ, ఆదినారాయణ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. వారే మన్నారంటే…
 తెలుగు ప్రజలందరూ ఒకటిగా ఉండాలని నాడు కర్నూలులో ఉన్న రాజధానిని హైదరాబాద్ తరలించారు.  నాటి ప్రజల త్యాగానికీ 59ఏళ్లు గడిచినా నేటికీ రాయలసీమకు ఏ ప్రభుత్వంకూడ న్యాయం చేయలేదు. రాయల సీమకు శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం రాజధాని రావలసివున్నా విభజన తర్వాత కొత్త రాజధానిని ఎంపిక చేసేటప్పడు ఈ విషయం విస్మరించి 2014లో నాటి ప్రభుత్వం రాజధానికి ఓంటెద్దుపోకడతో అమరావని ఎంపిక చేసింది.
అమరావతి రాజధాని నిర్మాణానికి పనికిరాదని ఎన్ని కమిటీలు  తేల్చిచెప్పినా వరద,భూకంపప్రాంతంలో ఉన్న అమరావతి రి ఖరారు చేశారు. అందుకు ప్రధాన కారణం అన్నిపార్టీలకు ఓట్లు, సీట్ల పందేరం మాత్రమే కావలసిఉండటమే.  శ్రీభాగ్ ఒప్పందాన్ని అమలు చేయకపోవడం ఏమిటి? శ్రీభాగ్ ఒప్పందాన్ని గాలికి వదిలేయడం వల్ల అమరావతిరి రాజధాని వెళ్లిపోయింది. ఈ ఒప్పందం అమలైఉంటే, రాయలసీమలో సమాన అసెంబ్లీ స్థానాలు ఉండేవి.
 రాయలసీమలో కరువుతో వేలాదిమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.  ప్రజలు వేరే ప్రాంతాలకు వలసలు వెలుతున్నారు.  నిరుద్యోగ యువత సరైన ఉపాధిలేదు.
నీటివాటలో రాయలసీమకు సరైన నిఖరజలాల వాటాలేదు, మొన్నటికీ మొన్న రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది మెడికల్ కాలేజిలను ఏర్పాటు చేయాలని తలపెడితే అందులో ఓక్క కాలేజీ మాత్రమే రాయలసీమకు కేటాయించారు. మిగిలినవన్నీ కోస్తా జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇది దేనికీ సంకేతం. గడిచిన ప్రభుత్వం రాయలసీమకు అన్యాయం చేయడం వల్లే ఆపార్టీ రాయలసీమలో పుట్టగతులు లేకుండాపోయింది.
ఆ పరిస్థితి నేటి ప్రభుత్వం తెచ్చుకోదని ఆశిస్తున్నాం.  రాయలసీమ మీద నిర్లక్ష్యం  ఇలాగే కొనసాగితే విద్యార్థులు, నిరుద్యోగులు ప్రభుత్వాలపై తిరగబడటం మినహా వేరే మార్గం లేదు.
ప్రభుత్వం వెంటనే స్పందించి శ్రీభాగ్ ఒప్పందాన్ని అమలుచేసి రాయలసీమలో రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయాలి..
ఈ కార్యక్రమంలో రమాకాంత్, కోదండ, అశోక్, నల్లారెడ్డి, శ్రీనివాస్, గిరి, రమేష్, శేఖర్, ప్రకాష్, ఈశ్వర్, నరసన్న తదితరులు పాల్గొన్నారు.