ముగ్గులతో టిఆర్ ఎస్ మునిసిపల్ ఎన్నికల ప్రచారం

గోడలు, పోస్టర్లు, బ్యానర్లు, కరపత్రాలు,ప్లెక్స్ బోర్డు… ఇలా ప్రతిదీ ఎన్నికల ప్రచారానికి ఉపయోగపడ్డాయి. ఇపుడు తాజాగా పార్టీలు ఇంటి ముందు వేసే  ముగ్గులను రాజకీయ ప్రచారానికి వాడుకుంటున్నాయి. అ మధ్య తమిళనాడులో ఒక రోజు పొద్దనే అన్ని ఇళ్ల ముందు ముగ్గులన్నీ రాజకీయమయిపోయి పోలీసులకుకంపరం పుట్టించాయి. ప్రతి ముగ్గు కేంద్ర పౌరసత్వ సవరణ చట్టానికి ఎన్ పిఆర్ కు వ్యతిరేకంగా రంగురంగుల్లో పిలుపునిచ్చింది. ప్రతి ముగ్గులో పౌర సత్వ సవరణ చట్టం రద్దు చేయాలనే డిమాండ్ నినాదం కనిపించింది.
ఇక రాయలసీమల  ప్రాంతీయ భావజాలంతో ముగ్గులను ప్రోత్సహిస్తున్నారు.  రాయలసీమకు అన్యాయం జరుగుతూ ఉందని, దీనిని ప్రతిబింబిస్తూ ముగ్గుల పోటీలు పెడుతున్నారు. రాయలసీమ సాంస్కృతిక వేదిక  ఇలాంటి  రాయలసీమ రాజకీయ సంక్రాంతి  ముగ్గులను పోటీకి ఆహ్వానించించింది. చివరి తేదీ జనవరి 17.
ఇపుడు తెలంగాణలో తెలంగాణ రాష్ట్రసమితి ముగ్గుల ద్వారా మునిసిపల్ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది.  నల్గొండ జిల్లా సూర్యపేట పురపాలక సంఘం పరిధిలో టి ఆర్ యస్ ఈ వినూత్నమైన ఎన్నికల ప్రచారానికి దిగింది.సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇండ్లముందు వేసే ముగ్గులలో కారు గుర్తుకే మనఓటు…. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి …కేటీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ ముగ్గుల రూపంలో నిశబ్ద ప్రచారం మొదలయింది. ఇది అందరిని ఆకట్టుకుట్టూ కుంది.
మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలుపుకోసం ఖమ్మం జిల్లాలో పార్టీ అభిమాన కుటుంబాలు ప్రతి రోజు తమ ఇంటి ముందు కారు గుర్తు ముగ్గు వేసి, రంగులు వేసి ముగ్గులను ఒక ప్రచార అస్త్రంగా మలుచుని ఓట్లు అభ్యర్దించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పిలుపునిచ్చారు