టిఆర్ఎస్ లో రామగుండం వార్ (వీడియో)

తెలంగాణలో అధికార టిఆర్ఎస్ పార్టీని కలవరపాటుకు గురిచేసే వార్త ఇది. పెద్దపల్లి జిల్లా రామగుండంలో అధికార పార్టీ కార్పొరేటర్లే మేయర్ మీద తిరుగుబాటు చేశారు. రామగుండం నగర పాలక సంస్థ సమావేశంలో టిఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రతిపక్ష కార్పొరేటర్లతో కలిసి మేయర మీద ఆందోళన చేశారు. సమావేశం జరగకుండా అడ్డుకున్నారు.

అయితే వీరంతా స్థానిక ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ వర్గం కార్పొరేటర్లే ఇలా చేశారని మేయర్ వర్గం నేతలు ఆరోపిస్తున్నారు. రామగుండం కార్పొరేషన్ లో జరగుతున్న పరిణామాలు చూస్తుంటే అధికార పార్టీలో రెండు వర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ వర్గం ఒకటి కాగా.. మేయర్ వర్గం మరొకటి ఉంది. 14 నెలల తర్వాత జరుగుతున్న ఈ సమావేశంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో మేయర్ సమావేశాన్ని వాయిదా వేసి వెళ్లిపోయారు. మహిళా కార్పొరేటర్లు కూడా తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఆ వీడియో కింద ఉంది చూడండి.

14 నెలలుగా సాధారణ సమావేశాలు జరపకుండా మేయర్ వాయిదా వేస్తూ.. ఇప్పుడు ఏకంగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించడాన్ని ప్రతిపక్ష సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారి ఆందోళనకు ఎమ్మెల్యే సోమారపు మద్దతుదారులు సపోర్ట్ చేశారు. దీంతో కార్పొరేషన్ సమావేశం రచ్చ రచ్చ అయింది. వాగ్వాదం తీవ్రమైపోవడంతో సమావేశం అర్థంతరంగా వాయిదా పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *