బ్రిటన్ లో భారతీయ కార్డియాలజిస్టు కరోనావైరస్ తో మృతి

భారతీయ సంతతికి చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ జితేంద్ర రాథోడ్ లండన్ లో కరొనా వైరస్ సోకి చనిపోయారు.
మరొక వైపు కోవిడ్ -19 రోగలక్షణాలు ముదిరి వూరిరాడని పరిస్థితి రావడంతో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కు తరలించారు. ఇంగ్లండులో ఆందోళన మొదలయింది. నిన్న సాయంకాలం అయిదింటి దాకాప్రధాని బాగనే ఉన్నారు. అయితే మరో రెండు గంటల్లోనే ఆయన పరిస్థితి విషమించింది. వూపిరాడని పరిస్థితి ఎదురయింది. దీనితో ఆయనకు ఆక్సిజన్ ఇవ్వాల్సి వచ్చింది. తర్వాత ముందు జాగ్రత్తగా ఆయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కు తరలించారు.
ఇది ఇలా ఉంటే సోమవారం ఉదయం డాక్టర్ జితేంద్ర రాథోడ్ మరణించారు. ఆయన బాగా పేరున్న హృద్రోగ నిపుణుడు. అంతా ఆయనను జితు అని పిలుస్తారు. ఇద్దరు సంతానం. కార్డిఫ్ లోని యూనివర్శిటీ హాస్పిటల్ ఆఫ్ వేల్స్ లో ఆయన చేర్పించారు. ఆయన వృత్తికిబాగా అంకితమయిన డాక్టర్ గా పేరుంది.డాక్టర్ రాథోడ్ వయసు 58 సంవత్సరాలు. ఆసుపత్రి మేనేజ్ మెంంట్ ఆయన మరణ వార్తను ప్రకటించింది. 1990 నుంచి ఆయన ఇక్కడే పని చేస్తున్నారు. ఆయన కరోనా పాజటివ్ అని పరీక్షల్లో తేలిందని, అనంతరం ఆయన చికిత్సకు తరలించారని, అయితే సోమవారం ఉదయం చనిపోయారని ఆసుపత్రి ప్రకటించింది.

ఇంతవరకుఇంంగ్లండులో 5373 మంది చనిపోయారు. నిన్న ఒక్క రోజు 439 మంది చనిపోయారు. నిన్న ఒక్క రోజు 3802 కొత్త కేసులు కనిపించాయి. దీనితో దేశవ్యాపితంగా కరోనా కేసులు 51,608 కి చేరాయి.