నేటి ఫేక్ న్యూస్ : అయోధ్య రామాలయానికి అంబానీ 500 కోట్ల విరాళం

ముఖేష్ అంబానీ అయోధ్యలో రామాలయ నిర్మాణానికి 500 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు ఒక వార్త వైరలవుతూ ఉంది. ఎపుడో 2017లొో ముఖేష్ అంబానీ ఉత్తర ప్రదేశ్ ముఖ్య మంత్రి  ఆదిత్యనాథ్ ను కలసి పుష్ప గుచ్ఛం ఇస్తున్నఫోటోను ఇపుడు చూపి  500 కోట్లు ఇస్తానని హామీ ఇస్తున్నట్లుగాసోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. భక్తి అంటే ఇదేనని డబ్బు ఇవ్వడమే భక్తి అన్నట్లు ప్రచారం చేస్తున్నారు. అయితే, బూమ్ లైవ్ . ఇన్ అనే వెబ్ సైట్ దీనిని ఫ్యాక్ట్ చెక్ చేసి ఇది ఫేక్ అని తేల్చింది.

ఈ వార్తని 7.3వేల మంది షేర్ చేశారు. 397 కామెంట్లు న్నాయి. అయితే, ఫ్యాక్ట్ చెక్ లో తేలిందేమిటంటే ఈ పోటో 2017 డిసెంబర్ 23న హిందీ జాగరణ్ పత్రికలో అచ్చయింది. ఈ సమావేశం జరిగింది ముంబయిలో. 2018లో  ఉత్తర ప్రదేశ్ లో జరగాల్సిన ఇన్వెస్టర్స్ మీట్ కు ముందు ఇది జరిగింది. ఈ మీట్ సంబంధించిన రోడ్ షోలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి ముంబయి వెళ్లారు. ఇదే ఫోటోని టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా ప్రచురిచింది. అపుడు ముఖేష అంబానీతో పాటు, రతన్ టాటా, దీపక్ పరేక్, సుభాష్ చంద్ర వంటి పారిశ్రామిక ప్రముఖలు కూడా ఆదిత్యనాథ ను కలుసుకున్నారు.