కరోనా కర్నూలు నుంచి ఒక మంచి వార్త

కరోనాకూపంగా మారిన కర్నూలు జిల్లా నుంచి ఒక మంచి వార్త.  కరోనాను జయించిన 24 మందిని విశ్వభారతి కోవిడ్ ఆస్పత్రి నుండి ఈ సాయంత్రం విడుదల చేశారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయిన వారిని కలెక్టర్ వీర పాండియన్ అభినందించారు. ఇప్పటివరకు కర్నూలు జిల్లాలో 31 మంది కరోనా కరోనా చికిత్స పొంది జబ్బునయం చేసుకుని ఆసుపత్రి నుంచి విడుదలయ్యారు.
కర్నూలు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా కోరల నుండి ఆరోగ్యంగా బయటపడి ఒకే రోజు 24 మంది డిశ్చార్చ్ కావడం బిగ్ రిలీఫ్ అని ఇది జిల్లా ప్రజలందరికీ, జిల్లా యంత్రాంగానికి కరోనాను జయించవచ్చనే మనో ధైర్యం కలిగించిందని  కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు.

ఈ సాయంత్రం డిశ్చార్చ్ అయిన 24 మందిలో కర్నూలు నగరానికి చెందిన వారు  7 గురు ఉన్నారు. మిగతా వారిలో  నంద్యాల పట్టణం నుంచి 7 గురు,  పాణ్యం  నుంచి ఇద్దరు; సిరివేళ్ళ నుంచి ఇద్దరు; గడివేముల నుంచి  ఓక్కరు; రుద్రవరం నుంచి ఒక్కరు; నందికొట్కూరు నుంచి ఇద్దరు; ఆత్మకూరు నుంచి ఒక్కరు; డోన్ నుంచి  ఒక్కరు ఉన్నారు.
కర్నూలు సమీపంలో ఉన్న విశ్వభారతి జిల్లా కోవిడ్ ఆస్పత్రికి వెళ్లి కలెక్టర్  కరోనా విజేతలను, డాక్టర్లను, సిబ్బందిని అభినందించారు.
డిశ్చార్చ్ ఆయిన 24 మందికి ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన నట్లు  రెండు వేల రూపాయల నగదు, ఫ్రూట్స్ కిట్స్ ను అందించారు.
వారందరిని ప్రత్యేక వాహనాల్లో వారి వారి ఇళ్లకు పంపించారు. స్టేట్ కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ అజయ్ జైన్, జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కూడా ఈ సమయంలో అక్కడ ఉన్నారు.
ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ కు వెళ్లి కరోనా బారిన పడి మెరుగైన ప్రభుత్వ వైద్యం..సదుపాయాలతో ..కరోనా మహమ్మారిని జయించి..ఆరోగ్యంగా.. ఆనందంగా.. కర్నూలు జిల్లా విశ్వభారతి కోవిడ్ ఆస్పత్రి నుండి ఈ సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్ళడం పట్లఅంతా హర్షం వ్యక్తం చేశారు.
ఈ నెల 6న జిల్లా కోవిడ్ ఆస్పత్రి విశ్వభారతి ఐసోలేషన్ వార్డులలో ఆ 24 మందిని చేర్పించారు.
ప్రభుత్వ సాయంతో  వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, జిల్లా యంత్రాంగం కృషితో వారు  కరోనా మహమ్మారిని జయించే స్థాయికి చేరుకున్నారు.   కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం 2 సార్లు రిపీట్ టెస్ట్ లను చేయించుకుని నెగటివ్ ఫలితం రావడంతో ఈ రోజు సాయంత్రం  విశ్వభారతి కోవిడ్ ఆస్పత్రి డాక్టర్లు వారిని ఇంటికి పంపించారు.
కరోనా బారిన పడినా తమ నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టనీయకుండా మొత్తం ప్రభుత్వం తరఫున భరించిందని,  డాకర్లు, వైద్య సిబ్బంది తమను బాగా చూసుకున్నారని విడుదల అనంతరం తెలిపాిరు.ః
ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలను, ఫ్రూట్స్ కిట్ ఇచ్చి ఆరోగ్యంగా ఇంటికి పంపిస్తున్న ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, ప్రభుత్వానికి, డాక్టర్లు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ వీరపాండియన్, అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఈ రోజు కొత్తగా కర్నూలు నుంచి 14 కేసులు వచ్చాయి. దీనితో మొత్తంగా జిల్లా కరోనా పాజిటివ్ కేసులు 275 కు చేరింది. యాక్టివ్ కేసులు 259. రాష్ట్రంలో 9 మంది చనిపోయిన జిల్లా కూడా కర్నూలే. ఇపుడు మరొక 24 మంది డిశ్చార్జ్ కావడంతో యాక్టివ్ కేసులు తగ్గుతాయి.
ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/telugu/breaking/andhra-corona-tally-crosses-1000-death-toll-31/