తలమాసినోడెవడో అడిగితే ఆర్టీసిని కల్పుతారా…. కెసిఆర్ జైత్రయాత్ర

ముఖ్యమంత్రి కెసిఆర్  హుజూర్ నగర్ వెళ్తున్నారు. మొన్నవాన వల్లో, జనం రానందునో సభ రద్దయిందని వార్తొలచ్చినా, ఈ సారిభారీ మెజారిటీ మోసుకుని భారీ బహిరంగ సభకు వెళ్తున్నారు, ఎల్లుండే.

ఆయన చాలా సంతోషంగా ఉన్నారు, మరొక వైపు కోపంతో రగిలిపోతున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షాలను వెనకేసుకుని తిరుగుతున్న ఆర్టీసి వాళ్ల మీద.

ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు ఓడిపోయినందుకు, కొత్త శక్తిగా రాష్ట్రంలో వస్తుందునకున్న భారతీయ జనతా పార్టికి డిపాజిట్ కూడా కూడా రానందుకు సంతోషంగా ఉన్నారు.

మొన్న పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి నాలుగు సీట్లు గెల్చుకోవడంతో ఇక అసలు ప్రతిపక్ష పార్టీ కాషాయ పార్టీయే  అని అంతా అనుకున్నారు.

అలాంటపుడు బిజెపికి డిపాజిట్టు రాకపోవడం చా లా సీరియస్ వ్యవహారమే.

హుజూర్ నగర్ ఎన్నిక నేపథ్యంలో కెసిఆర్ చేసిన వ్యాఖ్యలివి

హుజూర్నగర్ లో  భారీ మెజారిటీ తో గెలిపించారు అంత ఆశమాషి  ఎన్నిక కాదు.  ఎన్నికలు జరిగిన సంవత్సరం తరువాత వచ్చిన తొలి ఎన్నిక ఇది.

దీనితో ప్రభుత్వం ఏర్పాటు అవుతుందా చస్తుందా, ప్రతిపక్ష పార్టీలు చాలా దుష్ప్రచారం చేశాయి.  పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారు.

గతంలో ఇదే నియోజకవర్గంలో 7 వేల ఓట్ల తో ఒడిపోయాం. ఇపుడు  మా అభ్యర్థి 40 వేల పై చిలుకు ఓట్ల మెజార్టీ సాధించాడు.హుజూర్ నగర్ ప్రజల ఆశలు ఆశయాలు అన్ని నెరవేరుస్తాం

ఎల్లుండి అక్కడ కృతజ్ఞత సభ ఉంటుంది నేనే వెళ్తున్న వారి అవసరాలు అన్ని తీరుస్తా.

ప్రతిపక్ష పార్టీలు రాజకీయల కోసం పచ్చి అబద్ధాలు చెప్పడం మంచిది కాదు. నేను సభలో కూడా అదే చెప్తాను.ఏదిపడితే అది మాట్లాడితే ప్రజలు స్వీకరించరు హుజూర్ నగర్ లో అదే జరిగింది.

ప్రతిపక్ష పార్టీలు ఉంటే మంచిదే,  కానీ అయింది కాంది మాట్లాడితే ఎవ్వరు ఉరుకోరు.

 బీజేపీ కి డిపాజిట్ కూడా రాలేదు ,వాళ్ళు రోజు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూన్నారు.రోజు అదే పనినా.
ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీలు నోరు అదుపులో పెట్టుకోవాలి.

మా పార్టీ ,నేను ఎన్నో విజయాలు సాధించాం. ఈ అహంభావం ఉండ వద్దు మా పార్టీ నాయకులకు కూడా అదే చెప్తాను. రాష్ట్రం తెచ్చినా మాకు రాష్ట్రాన్ని  ముందుకు తీసుకే వెళ్లాలని ఉంటుంది. కాని కొన్ని తక్షణ కార్యక్రమాలు చేపట్టాం ,ముఖ్యంగా ఇంటింటికి నీళ్లు ఇచ్చే పథకం అంతేకాదు కాళేశ్వరం నీళ్లు , పవర్ సెక్టార్ లో విజయం సాధించాం

కొంతమంది ఎన్నికలను కూడా వాయిదా వేయాలని చెప్పారు.

కేసీఆర్ హెలికాప్టర్ ను కూడా చెక్ చెయ్యాలి అని అన్నారు. హెలికాప్టర్ లో ఏమైనా డబ్బులు తీసుకుపోతారా…

హుజూర్ నగర్ ప్రజలకు కృతజ్ఞతలు, పళ్ళ రాజేశ్వర్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు.

గతంలో మా అభ్యర్థులు కొంత తక్కువ తో ఓటమి ఓడిపోయారు.ఇపుయింది?

త్వరలోనే మున్సిపల్ ఎన్నికలకు వెళ్తాము

పల్లె ప్రగతి కార్యక్రమం అద్భుతమైనది గా జరిగింది.
మేము రెండు చట్టాలు తెచ్చాము,ఒక్కటి పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్టం, పంచాయతీ రాజ్, మున్సిపల్ లకు నిధులు ఇవ్వాలని చట్టంలో పెట్టాం.

1030 కోట్ల రూపాయలు మున్సిపాలిటీ లకు కూడా పెట్టాం
141 పురపాలక బాడీలకు 2000 కోట్ల రూపాయలు మంజూరు అవుతాయి. ఎన్నికల అనంతరం పట్టణ ప్రగతి కార్యక్రమం పెడుతాం

నవంబర్ లో మునిసిపల్ ఎన్నికలు

రేపు కోర్టు తీర్పు వచ్చిన తరువాత ఎప్పుడైనా మున్సిపల్ ఎన్నికలు జరువుతాం.

నవంబర్ మాసం లోపే మున్సిపల్ ఎన్నికలు పూర్తి అవుతాయి

నాందేడ్ జిల్లా ,చంద్రపూర్,జిల్లా ప్రజలు నా దగ్గరకు వచ్చారు తెలంగాణ లో జరిగే పోగ్రామ్స్ అక్కడ జరగడం లేదు అని వచ్చారు. టికెట్ ఇస్తే పోటీ చేస్తామన్నారు. కానీ మేము వారికి టికెట్ ఇవ్వలేదు.భవిష్యత్ లో చూద్దాం అని చెప్పాను

ఆర్టీసీ సమ్మె జరిగితే ఏంది, భూములు అమ్ముతాం

ఆర్టీసీ కార్మికులు ఎత్తుకున్న పంథా పిచ్చి పందా
వాళ్ళు అనవసరాలకు పోతున్నారు

మేమే భేషజాలకు పోలేదు,ఆర్ధిక మాంద్యం వస్తే మేము బడ్జెట్ తగ్గించమ్

3,4 ఎకరాల భూములు బాగా డిమాండ్ ఉన్నాయి వాటిని అవసరం అయినప్పటడు మాత్రమే అమ్ముతాం.

4 సంవత్సరాల కాలం వ్యవధి లో 67 శాతం పెంచిన రాష్ట్రం ఎక్కడ ఉంది

ఇంకా గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు ఎవడిని పడితే వాడు వచ్చిఅడిగితే ప్రభుత్వంలో కల్పుతారా…
అన్ని కార్పోరేషన్ ప్రభుత్వం లో కల్పమంటారు. ఎలా?
తలకాయ మాసిపోయినోడు అంటే ఎలా ? ఇది రాజకీయమా…

ఎక్కడ టెంట్ ఉంటే అక్కడ కూర్చుంటే రాజకీయమా?

మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్,బీహార్ ఆర్టీసీలు లలో లేవు
కమ్యూనిస్టు లు బాగా అంటారు వెస్ట్ బెంగాల్ లో ఉందా
మధ్య ప్రదేశ్ లో ఎవరు క్లోస్ చేశారు కాంగ్రెస్ అయంలో కాదా?

ఏ ప్రభుత్వం ఉన్నా సమ్మె చేస్తారు ఎందుకంటే వారికి యూనియన్ ఎన్నికల కోసం మాత్రమే.