హైకోర్టుకు మోటార్ సైకిల్ మీద వచ్చిన నాటి న్యాయవాదే… ఈయన

భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ కి ఈ రోజు చివరి పనిరోజు. శుక్రవారం ప్రత్యేకంగా తన పనికొద్దిగా తొందరగా ముగించుకున్నారు. ప్రధాన న్యాయమూర్తి కోర్టు అయిన ఒకటో నెంబర్ కోర్టులో ఆయన కేవలం నాలుగు నిమిషాల పాటే కూర్చున్నారు. ఆయన తో పాటు కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే కూడ ధర్మాసనం మీద ఉన్నారు. ఈ సమయంలో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు  రాకేష్ ఖన్నా ప్రధాన న్యాయమూర్తికి ధన్యవాదాలు తెలిపారు.
134 సంవత్సరాలుగా సలుపుతూ వచ్చిన రామజన్మభూమి వివాదాన్ని పరిష్కరించిన ఘనత జస్టిస్ గొగోయ్ కే దక్కింది. ఈ మేరకు ఆయన పేరు చరిత్రలో నిలిచిపోతుంది.
ఈ రోజు తను ఆధ్వర్యంలోని  ధర్మాసనంలో విచారణకు లిస్ట్‌ అయిన పిటిషన్లకు ఒకేసారి నోటీసులు జారీ చేశారు.
సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రంజన్‌ గగోయ్‌ కు సా 4 గం.లకు వీడ్కోలు పలకనుంది.
ఈనెల 17 వ తేదీన రంజన్‌ గగోయ్‌ పదవీవిరమణ పొందాల్సి ఉంది.రేపు శని,అదివారాలు శెలవు కాబట్టి ఆయన ఉద్యోగం ఈ రోజుతోనే ముగిసింది. నవంబర్ 17న ఆయన 65 సంవత్సరాలు పూర్తవుతాయి.
మహారాష్ట్రకు చెందిన జస్టిస్‌ శరద్‌ అర్వింద్‌ బోబ్డే (63) ఈ నెల 17 న చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ స్థానంలో భారత సర్వోన్నత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
గత ఏడాది అక్టోబర్ మూడో తేదీన ఆయన సుప్రీంకోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్ దీపక్ మిశ్రా నుంచిఆయన బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్ రంజన్ గొగోయ్ ఈ శాన్య భారత దేశం నుంచి చీఫ్ జస్టిస్ అయిన మొదటి వ్యక్తి.
ఈ మధ్య ఆయనని జర్నలిస్టుల ముఖాముఖి ఇంటర్వ్యుూఇవ్వాలని కోరారు. ఆయనదానిని సున్నితంగా తిరస్కరిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు (కింది ఫోటో). అయితే, ఒక 2018జనవరిలో నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఒక విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఇలా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విలేకరుల సమావేశం ఏర్పాటుచేయడం ఇదే మొదటి సారి. గతంలో ఇలా ఎపుడూ జరగలేదు. ఆ నలుగుర న్యాయమూర్తులలో జస్టిస్ గొగోయ్ ఒకరు. అపుడు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా సీనియర్ న్యాయమూర్తులకు కేసులను కేటాయించడంలో ఒకపద్దతిపాటించడంలేదని ఈ నలుగురు న్యాయమూర్తులు నిరసన తెలిపారు.
గౌహతి హైకోర్టులో ప్రాక్టిస్ చేస్తున్నపుడు రంజన్ గొగోయ్ యాజ్డి మోటార్ సైకిల్ మీద వచ్చే వారని, తర్వాత వెస్పా స్కూటర్ కొన్నారని , ఆపై మారుతి 800 కొన్నారని ఈ మధ్య జరిగిన ఒక పుస్తకావిష్కరణ సభలో గౌహతి హైకోర్టు సీనియర్ న్యాయవాది సురేంద్ర నాథ్ శర్మ గుర్తు చేసుకున్నారు.
మొదట 2001లో గౌహతి హైకోర్టు లోొ ఆయన శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. తర్వాత 2011 లో పంజాబ్ చండీగడ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. ఆ మరుసటి సంవత్సరమే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

(feature Photo Telegraph India)