ఈ నెల్లో మనోళ్లు మస్తు పార్టీ చేసుకున్నరు, రు.1500 కోట్ల లిక్కర్ సేల్

తెలంగాణలో మనోళ్లు రు.1500 కోట్ల మద్యం అవలీలగా తాగేశారని, భలే మాజా వస్తాందని అంటున్నారు.  రాష్ట్ర   ఆబ్కారీ శాఖ జనవరిలో జరిగిన మద్యం విక్రయాల లెక్కలు వెల్లడించింది. ఇది  ఇంకా పెరుగుతుందని చెబుతున్నారు.ఎందుకంటే, మునిసిపల్ ఎన్నికల్లో ఇంకా జోరుగు పార్టీ  చేసుకుంటారని ధైర్యం.
 తెలంగాణలో జనవరి నెల1వ తదీ నుంచి  20వ తేదీ వరకు సుమారు రూ.1,500 కోట్లు విలువైన 21.90 లక్షల కేసుల లిక్కర్‌, 20.80 లక్షల కేసుల బీరు అమ్మకం జరిగింది.
ఇది గతేడాదితో పోల్చితే సుమారు రూ.350 కోట్ల అధిక విక్రయం.
హైదరాబాద్‌లో సేలయింది  రూ.147 కోట్లు కాగా, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో రూ.140 కోట్ల అమ్మకం జోరుగా సాగింది.
రాష్టంలో మున్సిపల్‌ ఎన్నికల సందడి మొదలయ్యాక  మద్యం ఏరులై పారడం మొదలయింది. దీని లెక్క తర్వాత తేల్తుంది. ధరల పెంపు ప్రభావం పెద్దగా కనిపించడంలేదు. లిక్కర్ ధరలు పెరిగినా మనోళ్లు  నీరసపడటం లేదు. ఖజానా బలహీనపడటం లేదు.
 2019 జనవరి ఒకటి నుంచి 20 వరకు రూ.1,120 కోట్లు విలువైన మద్యం విక్రయాలు జరగగా పురపాలక ఎన్నికల కారణంగా ఇది బాాగా పెరిగింది.
జిల్లాల్లో పార్టీ చేసుకునేందుకు ఇంత ఖర్చయింది.
రంగారెడ్డిలో రూ.323 కోట్లు,
హైదరాబాద్‌లో రూ.147 కోట్లు,
నల్గొండలో రూ.170 కోట్లు,
మహబూబ్‌నగర్‌ జిల్లాలో రూ.110 కోట్లు,
మెదక్‌లో రూ.121 కోట్లు,
వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో రూ.140 కోట్లు ,
కరీంనగర్‌లో రూ.130 కోట్లు,
ఆదిలాబాద్‌ జిల్లాలో రూ.82 కోట్ల విలువయిన మద్యం విక్రయాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి.
ఇపుడు పుర ఎన్నికల పుణ్యమా అని మద్యం అమ్మకాలు ఘనంగా పెరిగాయి. మరో వైపు అక్రమ మద్యం చొరబడకుండా ఆబ్కారీ శాఖ అధికారులు నిఘా కట్టుదిట్టం చేశారు. రాష్ట్ర సరిహద్దుల్లో వాహనాల తనిఖీ ముమ్మరం చేశారు.