అనుకున్నదొకటి, అయిందొకటి, రాజధాని తరలింపు ఆర్డినెన్స్ తెస్తారా?

రాజధాని వికేంద్రీకరణ బిల్లు,  సిఆర్ డిఎ ఉపసంహరణ  బిల్లు శాసన మండలిలో ఇరుక్కుపోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధానిని విశాఖకు తరలించే ప్రత్యామ్నాయ తరుణో పాయం గురించి యోచిస్తున్నట్లు విశ్వసనీయం సమాచారం.
ముఖ్యమంత్రి జగన్ అనుకున్నట్లు వికేంద్రీకరణ, సిఆర్ డిఎ బిల్లులు పాస్ కాకుండా వాయిదా పడ్డాయి. అందువల్ల అసెంబ్లీని ప్రోరోగ్ చేసి ఆర్డినెన్స్ తెచ్చే విషయం ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే, దీనికి న్యాయపరమయిన చిక్కులున్నాయోమో చూడండని ఆయన నిపుణులను సంప్రదిస్తున్నారని తెలిసింది.
నిన్న శాసన మండలిలో జరిగిన పరిణామాలు ప్రభుత్వం పెద్దలకు బాగా ఆగ్రహం తెప్పించాయి. వాళ్లెవరూ వూహించని విధంగా ప్రతిపక్షం సెలెక్ట్ కమిటీకి బిల్లులు పంపాలని కోరడం,  మెజారిటీ సభ్యులు కోరుతున్నారు కాబట్టి, తన విచక్షనాధికారాలను ఉపయోగించి స్పీకర్ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపించారు. ఈ సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేసి, బిల్లులను పరిశీలించి సభకు నివేదికసమర్పించేనాటికి మూడు నాలుగు నెలలు పడుతుంది.అందువల్ల అంతవరకు క్యాపిటల్ మైగ్రేషన్ సాధ్యంకాదు. డెమోక్రసీలో బలమున్నడిదే రాజ్యం, ఎవరి బలం ఉంటే వాళ్లు చరిత్రపొడవునా, తమ అభిప్రాయాల ప్రకారం  చట్టాలు చేసి ప్రజాభిప్రాయంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. జగన్ తనకు బలమున్న అసెంబ్లీలో సునాయాసంగా బిల్లులు పాస్ చేయించారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష నేత  తనకు బలమున్న కౌన్సిల్ ఆపేయించారు. ఈ పరిణామల మీద సీఎం జగన్ సీరియస్ అయ్యారని అందుకే   విజయసాయిరెడ్డితో, న్మాయ నిపుణులతో  న్యాయ,రాజ్యాంగ పరమైన అంశాలపై సమాలోచనలు జరుపుతున్నారని తెలుస్తున్నది.  ఈ చర్చల్లో ప్రధానాంశం, ఆగిపోయిన బిల్లులను ఆర్డినెన్స్ ద్వారా చట్టం చేయడం, తర్వాత  శాసన సభ ఆమోదం పొందడం.
ఇలా చేసినందువల్ల జగన్ ప్రతీకారణ ధోరణితో పోతున్నారనే అనుమానం వస్తుంది. రాజ్యంగ సంస్థలను విస్మరిస్తున్నారని, షార్ట్ కట్ రూట్లో వెళతున్నారనే విమర్శ వస్తుంది. ఇప్పటికే  తనకు బలం లేని కౌన్సిల్ ను రద్దు చేస్తున్నారనే వార్త బాగా వ్యాపించింది. చివరకు అలాంటి ప్రతిపాదన లేదని స్వయాన వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
దీనితో ప్రతిపక్ష నాయకుడికిగా వ్యతిరేకంగా రూలింగ్ పార్టీ వారు నిరసనలు చెప్పుతున్నారు. ఇలాంటి అరుదు. సాధారణంగా  ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు గొడవచేస్తాయి. నిన్న టి కౌన్సిల్  పరిణామాలతో జగన్ అంచానాలు కొద్దిగా తారుమారుకావడంతో ఈ పరిస్థితి నెలకొంది.
విశాఖను క్యాపిటల్ రాజధానిగా వ్యతిరేకిస్తున్న టిడిపి పార్టీ విధానాన్ని వ్యతిరేకిస్తూ  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ధోరణిని నిరసిస్తూ  వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు. కంచర పాలెం ఊర్వశి నేషనల్ హైవే ను దిగ్బంధించాచరు. అక్కడ చంద్రబాబు  దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దీనితో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.