బాధాకరం, ఐదేళ్ల లోపు శిశుమరణాలలో ఇండియా టాప్

గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో భారత్ పాతాళంలోఉందని వార్తలు వెలువడిన 24 గంటల్లోనే మరొక బాధాకరమయిన వాస్తవం వెలుగులోకి వచ్చింది.
ప్రపంచంలో అండర్ ఫైవ్ శిశుమరణాలు అంటే పుట్టిన తర్వాత ఐదేళ్ల లోపు చనిపోతున్నపిల్లల సంఖ్య ఎక్కువగా ఉన్నదేశాల జాబితాలో భారత్ చేరింది.
జాబితాలో వూరికే చేరడం కాదు, 2017లో పదిలక్షల మరణాలతో భారత్ ప్రపంచంలోనే టాప్ అయింది.
ఈ జాబితాలో భారత్ పక్కన ఉన్నదేశాలు ఏవిటో తెలుసా?నైజీరియా, పాకిస్తాన్, కాంగో.
నేచర్ అనే అంతర్జాతీయ ప్రతిష్ట ఉన్న ఒక పరిశోధనా జర్నల్ లో ఈ విషయం అచ్చయింది. 2017లో ఎదురయిన పసిపిల్లల మరణాలలో ఈ నాలుగు దేశాల వాటా చాలా చాలా ఎక్కువ.
అంతర్జాతీయంగా శిశుమరణాలు తగ్గిపోతున్న మాట వాస్తవమే. అయితే ఇందులో భారత్ టాప్ లో ఉండటమే విచారకరం.
1950లో19.6మిలియన్ల మరణాలు నమోదయితే, 2017 నాటికి ఇవి 5.4 మిలియన్లకు పడిపోయాయి. ఈ మరణాలన్నీ కూడా అల్పాదాయ, మధ్యాదాయ దేశాలలోనే ఉంటున్నాయి. ప్రపంచ శిశుమరణాలలోఈ దేశాల వాటా 93 శాతం.
ఇక ఈ దేశాలలో కూడా భారత్ దేశంలో సంభవించిన శిశుమరణాలు (1.04 మిలియన్లు) చాలా ఎక్కువ. తర్వాతి స్థానం 0.79 మిలియన్లతో నేజీరియాది. 0.34 మిలియన్ల శిశుమరణాల తో పాకిస్తాన్ మూడో స్థానంలో ఉంటే, 0.25 మరణాలతో కాంగో నాలుగోస్థానంలో ఉంది.
‘ఇది విచారకరం, బాధకారం, ఎందుకంటే, ప్రతి రోజూ 15వేల మంది పిల్లలు చనిపోతున్నారు,’ ఈ రీసెర్చ్ పేపర్ రాసిన సీనియర్ రచయిత సైమన్ హే వ్యాఖ్యానించారు.
ఆయన వాషింగ్టన్ యూనివర్శీటీలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ ఎండ్ ఎవాల్యుయేషన్ కుచెందిన లోకల్ బర్డెన్ ఆఫ్ డిసీజెస్ గ్రూప్ డైరెక్టర్.
ఇండియాకు సంబంధించి 2015లో శిశుమరణాలు( under 5 mortality rate) ప్రతివేయి జననాలకు 43 మరణాలుగా ఉండింది. ఇది 2016లో 39 కి తగ్గింది.
భారత దేశంలో ఉత్తరప్రదేశ్ ( 59.7), అస్సాం(54.9) వాటి వల్ల గోబల్ గా సగటు మరణాలలో భారత్ టాప్ కు వస్తూ ఉంది. ఈపరిస్థితిని మెరుగు పర్చుకోవడంలో మధ్య ప్రదేశ్ (50.7), ఒడిషా (48.3) కొద్దిగా విజయవంతమయ్యాయి.

(Photo source: Research Matters