ముస్తాబవుతున్న మొజాంజాహి మార్కెట్

చారిత్రక వారసత్వ సంపద పరిరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగంగా,  మొజం జాహి మార్కెట్ ఇలా నిగనిగలాడబోతున్నది. తొందరల్లో ఇది హైదరాబాద్ నగరంలో ఒక ప్రముఖ పర్యాటక ఆకర్షణ కాబోతున్నది. మునిసిపల్ పాలనా  మంత్రి కెటిఆర్  ఆలోచన మేరకు ఈ ప్రాజక్టు చకచకా సాగిపోతున్నది.  మునిసిపల్ శాఖ కార్యదర్శి  అరవింద్ కుమార్ గారి నేతృత్వంలో తొందర్లో పూర్తవబోతున్నది.