కెసిఆర్ మీద కేసు, ఆర్టీసిలో ఆత్మహత్యలపై న్యాయవాది ఆగ్రహం

తెలంగాణా ఆర్టీసిలో ఆత్మహత్యలకు కారణం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, రవాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమారేనని కామిశెట్టి కరుణ సాగర్ అనే అడ్వొకేట్ కేసు వేశారు.  ముఖ్యమంత్రి, రవాణా మంత్రి ఆయన ఐపిసి సెక్షన్ 306 కింద కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. కంచన్ ఇన్స్ పెక్టర్ దానిని ఖమ్మం 2 టౌన్ కు పంపించారని న్యాయవాది తెలిపారు.

ఆర్టీ సి కార్మికులు ప్రభుత్వం విధించిన గడువులోపు ఉద్యోగ విధులకు రాకుండా తమను ఉద్యోగాలనుంచి డిస్మిస్ చేసుకున్నారని ముఖ్యమంత్రి చేసిన ప్రకటన వల్ల క్రుంగిపోయిన ఆర్టీసి కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నరని సాగర్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

పన్నెండో తేదీన శ్రీనివాస రెడ్డి అనే డ్రైవర్ ముఖ్యమంత్రి ప్రకటనతో ఖమ్మంలో తన ఉద్యోగం పోయిందని భయపడి కుటుంబ సభ్యుల ఎదుటే తగలపెట్టుకుని ఆత్మాహుతి చేసుకున్నాడని  కరుణ సాగర్ తన ఫిర్యాదులో ఉదహరించారు.

ఇదే విధంగా ఆర్టీని ప్రభుత్వంలో విలీనం చేసేది లేదని అలాంటి హామీ టిఆర్ ఎస్ ఇవ్వలేదని రవాణా మంత్రి అజయ్ కుమార్ ప్రకటించడం కూడా కార్మికుల ఆత్మహత్యలకు కారణమయిందని చెబుతూ ఆత్మహత్యలను ప్రోత్సహించిన నేరం కింద వారి  మీద చర్యలు తీసుకోవాలని న్యాయవాది కోరారు.