ఇన్ని అబద్దాలా? ఆర్టీసి లెక్కల మీద హైకోర్టు సీరియస్

ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మ ఫై విరుచుకుపడ్డ హై కోర్ట్ ఛీఫ్ జస్టిస్ ఆర్ ఎస్ చౌహాన్ విరుచుకుపడ్డారు. ఈ రోజు ఆర్టీసి సమ్మె వ్యవహారం మళ్లీ కోర్టు విచారణకొచ్చింది. ఈ రోజు ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణరావు, ఆర్టీసి ఎండి సునీల్ శర్మ వేర్వేరు నివేదికలు సమర్పించారు. అయితే, ఒకే ప్రభుత్వం నుంచి వచ్చినా రెండు ఒకేలా లేకపోవడంతో హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒక దశలో ఆర్థిక శాఖ కార్యదర్శి కోర్టును క్షమాపణ కోరారు.
నా 15 ఏళ్ల జడ్జి చరిత్రలో ఎంత అబద్దాలు చెప్పే అధికారులను ఎక్కడా చూడలేదని చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానిం చడం విశేషం.  మూడు రాష్ట్రాల్లో పనిచేసాను,చూశాను, ఎక్కడా హై కోర్ట్ కు ఇలా ఎవరు అబద్దాలు చెప్పలేదని ఆయన ఆశ్చర్యపోయారు.
ఈ రోజు ఆయన చేసి కామెంట్స్:
ఆర్టీసీ ఎండీ… మీరూ( ఆర్థిక శాఖ కార్యదర్శి) చెబుతున్న అంకెలు వేర్వేరుగా ఉన్నాయి. మేం వీటిని పరిగణనలోకి తీసుకోవాలా?
2-6-2014 నుండి అక్టోబర్ 2019 వరకు ఉన్న మొత్తం లెక్కలను మీకు అందించిన తాజా నివేదిక లో పొందుపరిచాం.కాగ్ నివేదిక అనుగుణంగా తయారు చేసిన పూర్తి వివరాలతో మీకు అందించామని ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణ రావు..
అయితే, కోర్టును తప్పుదోవ పట్టించేందుకు చాలా తెలివిగా గజిబిజి లెక్కలు., పదాలు వాడాతున్నారని  నివేదిక పై మరోసారి  చీఫ్ జస్టిస్ అసహనం వ్యక్తం చేశారు.
ఋణ పద్దుల కింది కేటాయించిన నిధులు అప్పు కాదని, గ్రాంటు అని తెలివిగా చెబుతున్నారని ఆయన అన్నారు.  హైకోర్టు
ఇంతవరకు ఏ బడ్జెట్ లో అలా చూడలేదని చెబుతూ  ప్రభుత్వం ఇచ్చిన నివేదికను కోర్టు హల్ లో చదివి వినిపించారు. ‘మంత్రికి సునీల్ శర్మ తప్పుడు లెక్కలు ఇచ్చారు.మంత్రికి తప్పుడు లెక్కలు ఇస్తే ప్రభుత్వాన్ని చిట్ చేసినట్లే. క్యాబినెట్ కి సైతం అధికారులు తప్పుడు లెక్కలు ఇచ్చారు.సీఎం ని సైతం తప్పుడు లెక్కలతో స్టెేట్ మెంట్స్ ,’ అని చీఫ్ జస్టిస్ అన్నారు.
ఛీఫ్ జస్టిస్ ఇంకా ఏమన్నారంటే…
తప్పుదోవ పట్టించిన ఆర్టీసీ ఇంచార్జి ఎండీని మంత్రి ఎందుకు కొనసాగిసస్తున్నారో అర్థం కావడం లేదు.
 ఆర్టీసికి నిధులు ఇవ్వాల్సిన అవసరం లేనప్పుడు… జీహెచ్ ఎంసీని ఎందుకు అడుగుతున్నారు?
జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, ఆర్థిక శాఖలు… ఒక్కొక్కరు ఒక్కో పాట పడుతున్నారు.ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా చెబుతున్నారు.హైకోర్టుతో వ్యవహరించే తీరు ఇదేనా?