సంగారెడ్డి జగ్గారెడ్డి ఒక్క రుపాయ పనిచేయలే, హరీష్ రావు నిప్పులు

సంగారెడ్డి బైపాస్‌రోడ్‌ వద్ద ఆర్థిక్  మంత్రి హరీశ్ రావు మునిసిపల్ ఎన్నికల  ప్రచారం  జోరుగా  చేస్తూ ఇక్కడి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీద నిప్పుకురిపించారు. ఆయన అసలు పనికాడన్నాడు, ఆయన దగ్గిర డబ్బులెక్కువ, మాటలెక్కువ, చేతలు తక్కువ ఎద్దేవా చేశారు.
ఆయనను నమ్ముకోవద్దని, తెలంగాణ రాష్ట్రసమితిమాత్రం నిజమని, ఆ పార్టీే గెలిపించాలని కోరారు.
ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీరును తీవ్రంగా దుయ్యబడుతూ ఈ ఏడాది లో ఇక్కడి ఎమ్మెల్యే రూపాయి పని చేయలేదు.‌ ఇంతవరకు పైసా పని చేయని వాడు.. నాలుగేళ్లు ఏం పని చేస్తారని ప్రశ్నించారు. 35 కోట్లు సంగారెడ్డి‌ మున్సిపాలిటీ ‌అభివృద్దికి మంజూరయ్యాయని ఆయన వెల్లడించారు.
పోతిరెడ్జి పల్లిలోని ఐదు వార్డులు సంగారెడ్డిలో కలిసాయి. ఈ ఐదు వార్డులు బాగా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.  ఈ వార్డులు మున్సిపాలిటీ లో ఉంటే నిధులు ఎక్కువ వస్తాయి. ఎమ్మెల్యే చేతల్లో‌ఏమీ లేదు. ‘
ఢిల్లీలో‌కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. రాజ్య సభ సభ్యుడు ‌లేడు. ఎసీడీపీ నిధులు ఒక్క రూపాయి లేదు. తన దగ్గిర బాగాబ డబ్బులున్నాయని బాగా ఖర్చు చేస్తున్నాడంట, టిఆర్ ఎస్ వాళ్లు పేదవాళ్లు…పని మాత్రం బాగా చేస్తారు. పని చేసిన వాళ్లను గెలిపించండని ఆయన కోరారు.
 సంగారెడ్డి  పదో‌వార్డులో మంత్రి హరీశ్ రావు ప్రచారం చేస్తూ  దున్నపోతుకు గడ్డి వేస్తే బర్రె పాలిస్తదా అని దెప్పిపొడిచారు. ‘పాలు ఇచ్చే బర్రెకే గడ్డి వేయాలి. మీ దయతో‌తెరాస‌ అధికారంలో ఉంది. నాలుగేళ్లు కేసీఆర్ ప్రభుత్వం ఉంటుంది. ఎంపీగా ప్రభాకర్ రెడ్డి ఉంటారు. ఏదైనా చేస్తే తెరాస ప్రభుత్వం చేయగలుగుతుంది తప్ప వేరే ఎవరైనా చేస్తరా.బ్యాట్ గుర్తు, క్యారం బోర్డు , చేయి, పూవు గుర్తులోళ్లు‌ తెగ తిరిగుతున్నారు.
ఇవాళ ఎన్నికలని తిరిగే వీళ్లు ఎన్నికల తర్వాత కనపడతడా.రాష్ట్రంలో ఉండేది‌ తెరాసనే,’ అని ఆయన అన్నారు
ఒకసారి సంగారెడ్డి కి మెడికల్ ‌కాలేజ్ ఇచ్చారని కరపత్రాలు‌ వేసి, సీఎం‌ కేసీఆర్ కు కృతజ్ఞతలు ‌చెప్పాడు ఇక్కడి ఎమ్మెల్యే ఇప్పుడేమో సీఎం‌పై విమర్శలు‌చేస్తున్నారు.
ఆయనను నమ్మవద్దని ఆయన అన్నారు.