రయీస్ సినిమా చూపింది నిజమేనా… గుజరాత్ లో రు. 252 కోట్ల అక్రమ మద్యం పట్టివేత

గుజరాత్ లో ప్రొహిబిషన్ ఉంది. అక్కడ మద్యం తయారుచేయడం, అమ్మడం, సరఫరా చేయడం,తాగడం అన్ని నేరాలే. అయితే, ఇదంతా పైకి మాత్రమే. లోన, రహస్యంగా  గుజరాత్ లో అక్రమ మద్యం ఏరులై పారోతుంది. అక్రమ మద్యం సామ్రాజ్యం నడుస్తూ ఉంది.
గుజరాత్ లో ప్రతి ఇంట్లో జోరుగా మందుకొడుతున్నారని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఒక నెల కిందట చేసిన వ్యాఖ్య మీద దూమారం ఇంకా చెలరేగుతూనే ఉంది. గుజరాత్ పేరుకే డ్రై రాష్ట్రమని, నిజానికి తలసరి మద్య విక్రయం గుజరాత్ లో నే ఎక్కువ అని, లెక్క లు తీస్తే, గుజరాతే పెద్ద మందురాష్ట్రమని గెహ్లాట్ అన్నారు.
దీనికి గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రుపానీ అభ్యంతరం చెప్పారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలవ లేక కాంగ్రెస్ పార్టీ నేత గెహ్లాట్ ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, ఇది మహాత్మగాంధీని, రాష్ట్ర ప్రజలను అవమానించడమేనని,  దీనికి ఆయన గుజరాత్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
అటువైపు ఈ గొడవ నడుస్తూనే ఉంది, మరొక వైపు నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి రూపానీ ఆసక్తి కరమయిన విషయాలు వెల్లడించారు. ఆయన వెల్లడించిన విషయాలు గుజరాత్ లో అక్రమ మద్యం వ్యాపారం ఎంతో జోరుగా సాగుతున్నద అర్థమవుతంది.
గుజరాత్ ఇపుడు అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి.నిన్న ప్రశ్నోత్తరాల సమయంలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ గత రెండేళ్లలొ గుజరాత్ పోలీసులు రు. 252 కోట్ల విలువయిన అక్రమ మద్యం స్వాదీనం చేసుకున్నారని చెప్పారు. పోలీసులు పట్టుకున్న అక్రమ మద్యంలో రు. 231 కోట్ల ఐఎం ఎఫ్ ఎల్, రు.17.79 కోట్ల బీరు, రు, 3.12 కోట్ల నాటు సారా ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి హోం శాఖ కూడా పర్యవేక్షిస్తున్నందున అక్రమ మద్యం మీద సభ్యులకు ప్రశ్నలకు స్వయంగా సమాధానం చెప్పాల్పి వచ్చింది.
అక్రమ మద్యం వ్యాపారం జోరుగా సాగుతున్న జిల్లాలో అహ్మదాబాద్ నెంబర్ వన్ (రు. 25.08 కోట్లు). తర్వాతి స్థానం బనస్కాంత (రు. 22.13 కోట్లు), మూడో స్థానం రు. 17.15 కోట్లతో వల్సాద్ ది.
ఎప్పటినుంచో మహాత్మాగాంధీ సొంతరాష్ట్రమయిన గుజరాత్ లో మద్యపాన నిషేధం అమలులో ఉంది. అయితే, చీకటి వ్యాపారం మాత్రం జోరుగా సాగుతూ ఉంది.
ఇది బాలివుడ్ ను కూడా ఆకర్షించింది. 2017 షారూక్ ఖాన్ మూవీ రయీస్ గుర్తుందిగా. రాహుల్ దోలాకియా దర్శకత్వంలో గౌరీ ఖాన్ తీసిన చిత్రం ఇది. బాక్సాఫీస్ దగ్గిర సూపర్ హిట్ అయిన మూవీ ఇది. మొదటి పదిరోజుల్లోనే నూరు కోట్ల రూపాయలు వసూలు చేసిన చిత్రం ఇది. షారూక్ ఖాన్ కు ఫిలిమ్ ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డు తెచ్చిన సినిమా ఇది.మూవీ సౌండ్ ట్రాక్ యూ ట్యూట్ లో 800 మిలియన్ వ్యూస్ తెచ్చుకుని రికార్డు సృష్టించింది.
ఈ సినిమా మద్యపాన నిషేధం అమలులో ఉన్న గుజరాత్ లో అక్రమ మద్యం వ్యాపారం ధీమ్ తో వచ్చింది. చిత్రంలో షారూక్ ఖాన్ పేరే రయీస్. చిన్న వయసులోనే లిక్కర్ అక్రమ వ్యాపారంలోకి వచ్చి ఒక డాన్ దగ్గిర పని చేసి తర్వాత సంతంగా మద్యం స్మగ్లింగ్ చేయడం మొదలుపెడతాడు.
సినిమా ప్రకారం గుజరాత్ లో అక్రమ మద్యం వ్యాపారం విలువ రు. 25 వేల కోట్లు. ఇపుడు ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ , గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కూడా అక్రమ మద్యం వ్యాపారాన్ని అపలేకపోయారనేది ఈ సినిమా సందేశం. గుజరాత్ లిక్కర్ డాన్ గా పేరున్న అబ్దుల్ లతీఫ్ జీవితం ఆధారంగా ఈ సినిమా తీశారు. గుజరాత్ లో బాంబే ప్రొహిబిషన్ యాక్ట్ 1949 , 1960 నుంచి అమలులో ఉంది.నాటుసారా తాగి ఎవరైన చనిపోతే, నాటు సారా తయారు చేసిన వాళ్లకు మరణ శిక్ష చట్టం తీసుకువచ్చిన రాష్ట్రం కూడా గుజరాతే.
బాలివుడ్ సినిమా తీసే స్థాయికి అబ్దుల్ లతీఫ్ అతగాడి అక్రమ మద్యం వ్యాపారం పెరిగాయంటే అక్కడ ఏ పరిస్థితి ఉందో వూహించవచ్చు. దేశంలో లిక్కర్ బిజినెస్ విలువు రు. 56 వేల కోట్ల దాకా ఉందని, అందుకే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్యపాన నిషేధాన్ని కఠినంగా అమలుచేయదని మానవ హక్కుల ఉద్యమ నాయకురాలు మేధా పట్కర్ కూడా వ్యాఖ్యానించారు. సినిమాలో అబ్దుల్ లతీఫ్ కు రూలింగ్ పార్టీ నేతలతో ఉన్న అనుబంధాన్ని చాలా చక్కగా చూపించారు.
ఇప్పటీకి గుజరాత్ లో లిక్కర్ హోం డెలివరీ పర్ ఫెక్ట్ గా సాగుతూ ఉంది. ఇది అందరికి తెలిసిందే. ఫుడ్ డెలివరీ సంస్తలు చేసినట్లు అక్రమ మద్యాన్ని గుజరాత్లో ఇంటికొచ్చి అందించిపోతారు స్మగ్లర్లు. అబ్దుల్ లతీఫ్ పేరును బిజెపి బాగా వాడుకుంది. లతీఫ్ ను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించి ఎన్నికల్లో బిజెపి బాగా లబ్దిపొందింది. చివరకు అబ్దుల్ లతీఫ్ ను పోలీసులు ఎన్ కౌంటర్లో చంపేస్తారు. లతీఫ్ మాఫియా యుగం ముగిసింది.కాని, గుజరాత్ అక్రమ మద్యం వ్యాపారం ఆగలేదు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి విజయ్ రుపానీ అసెంబ్లీలో వెల్లడించిన అక్రమ మద్యం వ్యాపారం గణాంక వివరాలు రుజువు చేస్తాయి.