ఎమ్మెల్సీ ఖాళీకి వైసిపి అభ్యర్థిగా డొక్కా నామినేషన్, మరి కౌన్సిల్ రద్దుండదా?

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులుకు ఆయన తన నామినేషన్‌ పత్రాలు అందచేశారు.
ఒక వైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలిని రద్దు చేసేందుకుఅన్ని ప్రయత్నాలు చేస్తుూనే మరొక వైపు దళిత నాయకుడయిన డొక్కాని కౌన్సిల్ కు పంపాలనుకోవడం చిత్రంగా ఉంది.రాజధానిని అమరావతినుంచి వైజాగ్ కు తరలించేందుకు ప్రవేశపెట్టిన రెండుకీలకమయిన బిల్లులను కౌన్సిల్ ఆమోదించకుండా సెలెక్ట్ కమిటీ పరిశీలనలకు పంపింది. తర్వాత కౌన్సిల్ ను రద్దు చేసేందుకు అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి జగన్ ప్రభుత్వం కేంద్రానికి కూడా పంపింది. అయితే, కేంద్రం నుంచి స్పందన లేదు.  ఈ లోపు పలువురు మేధావులు కౌన్సిల్ రద్దు నిర్ణయాన్ని వ్యతిరేచించారు. తెలుగుదేశం పార్టీ అధికత్యత ఉన్న కౌన్సిల్ లో బిల్లులు పాస్ కాకపోతే, కౌన్సిల్ ఏకంగా రద్దే చేయాలనుకునే ధోరణి బాగా విమర్శలు ఎదుర్కొంది. చివరుకు దీనిమీద బోలెడు వ్యంగ్యం కూడా సోషల్  మీడియా ప్రవహించింది. హైకోర్టులో కేసులు  వ్యతిరేకంగా వస్తే హైకోర్టును రద్దు చేస్తారు, అలాగే సుప్రీంకోర్టును రద్దు చేస్తారా అనే జోక్సు కూడా బాగా షేర్అయ్యారు. ఈ నేపథ్యంలో కౌన్సిల్ ఏర్పడిన ఖాళీని పూరించేందుకు ఎన్నిక జరుగుతూ ఉంది.
ఈ పోస్టుకే మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ నామినేషన్ వేశారు. మొన్న మొన్నటి దాకా తెలుగుదేశం తరఫున కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నారు. ఈ మధ్య ఆయన పార్టీ మారారు. ఈ పోస్టుకు రాజీనామా చేశారు.
కౌన్సిల్ ఎన్నికకు నామినేషన్ వేస్తున్నపుడు  వైఎస్సార్‌ సీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి, ఎంపీ నందిగం సురేష్‌, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, నంబూరి శంకర్‌రావు, ఉండవల్లి శ్రీదేవి, జంగా కృష్ణమూర్తి తదితరులు కూడా ఆయన వెంట ఉన్నారు.
కౌన్సిల్ రద్దు చేయాల్సింది పార్లమెంటు కాబట్టి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానాన్నికేంద్రం పట్టించుకోదని, అందువల్ల కౌన్సిల్ రద్దుఅయ్యే అవకాశం లేనందున  ఆ వేకెన్సీని పూరించేందుకు  రాజీనామా చేసి వచ్చిన డొక్కాకే అవకాశం కల్పిస్తున్నారని వైసిపి వర్గాలు చెబుతున్నాయి.