గ్రేటర్ హైదరాబాద్ కరోనా కంటైన్ మెంట్ జోన్లివే…

కరోనా పాజిటివ్ కేసులు జోరుగా పెరుగుతున్న గ్రేటర్‌ హైదరాబాద్ లో ప్రస్తుతం 159 కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నట్లు జిహెచ్‌ఎంసి అధికారులు ప్రకటించారు.
ఇపుడు కోవిడ్19 నియమ నిబంధనల ప్రకారం ఒక ఇంట్లో ఎవరికైనా కరోనా పాజిటివ్ అని తేలితే ఆ ఇంటిని మాత్రమే కంటైన్‌మెంట్ జోన్ గా  ప్రకటించి కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్ చేస్తున్నారు.
అధికారుల లెక్కల ప్ర కారం గ్రేటర్ హైదరాబాద్  లోని 6 జోన్లతో పాటు శివారు మున్సిపాలిటీలతో కలిపి 159 కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నాయి.
159 కంటైన్‌మెంట్ జోన్లు వివరాలు
1.ఎల్‌బినగర్ జోన్ : ఉప్పల్ సర్కిల్ 16, సరూర్‌నగర్ సర్కిల్ 4, హయత్‌నగర్ సర్కిల్ 1, మొత్తం 21
2. చార్మినార్ జోన్ : మలక్‌పేట్ సర్కిల్ 1, సంతోష్‌నగర్ సర్కిల్ 16, చంద్రాయణగుట్ట సర్కిల్ 2, ఫలక్‌నుమా సర్కిల్ 4, చార్మినార్ సర్కిల్ 5, మొత్తం 28.
3. ఖైరతాబాద్ జోన్ : మెహిదిపట్నం సర్కిల్ 5, కార్వాన్, జియాగూడ డివిజన్ 17, ఖైరతాబాద్ 5, జూబ్లీహిల్స్ సర్కిల్ 8 మొత్తం 35.
4.సికింద్రాబాద్ జోన్ : సికింద్రాబాద్ సర్కిల్ 6, ముషీరాబాద్ సర్కిల్ 7, అంబర్‌పేట్ 13, మల్కాజ్‌గిరి 7, మొత్తం 33.
5. కూకట్‌పల్లి జోన్ : మూసాపేట సర్కిల్‌లో 10
6. శేరిలింగంపల్లి జోన్ : శేరిలింగంపల్లి సర్కిల్ 5.
7. రాజేంద్రనగర్ సర్కిల్: మణికొండ 7, చందాన గర్ 4, కుత్బూల్లాపూర్ 7, జల్‌పల్లి మున్సిపాలిటీలో 6, బడంగ్‌పేటలో 3 మొత్తం 27