గ్యాస్ ధరల పెంపునకు అనంతపురంలో నిరసన

పెరిగిన గ్యాస్ ధరలకు నిరసనగా సిపిఎం ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో గ్యాస్ సిలిండర్ తో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ సామాన్య ప్రజలు నెత్తిన కేంద్ర ప్రభుత్వం తీవ్ర భారం వేసిందని ఆగ్రహించారు. మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తూ, మతాల మధ్య చిచ్చు పెట్టడానికి మాత్రమే  పని చేస్తుందని ఆయన విమర్శించారు. ప్రజల మీద పడుతున్న ఆర్థిక భారం గురించి ఆలోచించడం లేదని విమర్శించారు. ఈ ధోరణి గళమెత్తాల్సిన  అవసరం అన్ని రాజకీయ పార్టీలపై ఎంతైనా ఉందన్నారు.
నిన్నకేంద్ర ప్రభుత్వం నాన్ సబ్సిడీ  14.2కేజీల వంటగ్యాస్ సిలిండర్ ధను అమాంతం  రు. 149 లు పెంచిన సంగతి తెలిసిందే. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయో లేదో కేంద్రం ధరలు పెంచేసింది.అంటే ధరలు పెంచాలన్న నిర్ణయాన్ని ఢిల్లీ ఎన్నికల కోసం వాయిదావేసుకుందని అనుకోవాలి. 2014 జనవరి నుంచి ఇంతభారీగా సిలిండర్ ధరను పెంచడం ఇదే మొదటిసారి. ఎన్డీయే ప్రభుత్వం గత ఆరు నెలలో గ్యాస్ ధర పెంచడం ఇది ఆరోసారి.