ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి జగన్ సమావేశం

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సాయంత్రం సమావేశమయ్యారు.  ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ప్రాజెక్టులకు నిధులు, విభజన హామీల  గురించి చర్చించేందుకు  సీఎం జగన్‌ నేడు ఢిల్లీ వచ్చారు.
చాలా రోజు ముఖ్యమంత్రి జగన్  సమావేశం వాయిదాపడుతూ వస్తున్నది. గతంలో రెండు సార్లు ప్రధాని మోదీని హోమ్ మంత్రి అమిత్ షాను కలిసేందుకు జగన్ ఢిల్లీ వచ్చారు. అయితే వాళ్లెవరూ కలువ లేదు. ఒక ముఖ్యమంత్రిని ఇలా కలవకుండా ప్రధాని, హో మ్ మంత్రి వెనక్కి పంపించడం చాలా వూహాగానాలకు తావిచ్చింది.ఇపుడు ఉన్నట్లుండి జగన్ ను ఢిల్లీ ఆహ్వానింంచారు. దీనికి కారణం, ఢిల్లీ ఎన్నికల్ల బిజెపికి చాలా గట్టి దెబ్బ తగలడమే నని చాలా మంది చెబుతున్నారు.రాష్ట్రాలలో బిజెపి క్రమంగా ఓడిపోతూ వస్తున్నది. ఎక్కడయి బలమయిన ప్రాంతీయ పార్టీలున్నాయమో అక్కడ బిజెపి తలెత్త లేకపోతున్నది.అందులో ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్,తెలంగాణలుకూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బిజెపికి రాజ్యసభలో సొంత బలం పెరగడం సాధ్యం కాదు. అందువల్ల ప్రాంతీయ పార్టీల నేతలతో సఖ్యంగా ఉండాలని ఆ పార్టీయేచించడమే జగన్ కు ప్రధానితోభేటీ ఏర్పాటుచేయడానికి కారణమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. జగన్ 22 మంది లోక్సభ సభ్యులున్న పార్టీకి నాయకుడు.అంతేకాదు, వచ్చే రెండేళ్లో వైసిపి బలగం రాజ్యసభలో 10కి చేరుకుంటుంది. అందువల్ల జగన్ విస్మరించడం సరికాదని బిజెపి భావించినట్లు కనిపిస్తుంది. దానికితోడు సిఎఎ, ఎన్ పిఆర్ ల విషయంలో జగన్ ను దారికి తెచ్చుకోవడం చాలా అవసరం. జగన్  తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లాగా ప్రధాని మీద,బిజెపి మీద చరుకలేయడం లేదు. అందువల్ల జగన్ ని దూరంగా ఉంచడం కేంద్రానికి బిజెపికి కూడా అంత మంచి కాదని బిజెపి నాయకత్వం భావించినట్లు కనిపిస్తున్నది.

 ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్రానికి సంబంధించిన పలు డిమాండ్ల గురించి సీఎం జగన్‌ ఇటీవలే ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో బుధవారం ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా తాను లేఖలో పేర్కొన్న అంశాలను ప్రస్తావించినట్లు తెలిసింది. అలాగే పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిన రూ.3,800 కోట్లకుపైగా నిధులను విడుదల చేయాల్సిందిగా మోదీని సీఎం కోరారనితెలిసింది.

సమావేశం పూర్తి వివరాలు అందాల్సి ఉంది.