మాజీ మంత్రుల ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ మీద కేసు : సిఐడి ఎస్ పీ మేరీ

సిఐడి ఎస్ పి మేరీ ప్రశాంతి చెప్పిన వివరాలు
అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ కు సంబంధించి మాజీ మంత్రులు ప్రత్తి పాటి పుల్లారావు, నారాయణల మీద కేసు నమోదు చేసిన  సీఐడీ ఎస్పీ మేరీ ప్రశాంతి  వెల్లడించారు.  గుంటూరు జిల్లా మంగళగిరి టౌన్ పోలీసు స్టేషన్ లో ఆమె విలేకరులతో మాట్లాడారు.
ఆమె చెప్పిన వివరాలు:  
‘మాజీ మంత్రులు నారాయణ ,ప్రత్తిపాటి పుల్లారావు ,బెల్లంకొండ నరసింహాల పై కేసునమోదయింది. తమని మభ్యపెట్టి తనభూమి కొనుగోలు చేసారని వెంకటాయపాలెం దళిత మహిళ పోతురాజు బుజ్జి పిర్యాదు చేసింది.
తమ నుంచి 0.99 సెంట్లు కొనుగోలు చేసినట్టు విచారణలో వెల్లడైంది. 420 ,506 ,120 b ,ఐపీసీ సెక్షన్ 3 కింద కేసు నమోదు చేసాం.
సీఐడీ విచారణలో అనేక  ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. 797 తెల్లరేషన్‌కార్డు హోల్డర్స్‌ భూములు కొన్నట్టు నిర్ధారణ అయింది.
రూ.3 కోట్లకు చొప్పున ఎకరం భూమి తెల్లరేషన్‌కార్డు హోల్డర్స్ కొనుగోలు చేసినట్టు గుర్తించాము.
రూ.220 కోట్లతో భూమి కొనుగోలు చేసినట్లు గుర్తించాము. తెల్లరేషన్ కార్డు హోల్డర్స్‌తో కొనుగోలు చేయించిన వారి వివరాలపై ఆరాతీస్తున్నాము.
విచారణ కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసాము. అమరావతిలో 129 ఎకరాలు 131 మంది తెల్లరేషన్‌ కార్డు హోల్డర్స్‌ కొనుగోలు చేసారు.
పెద్దకాకానిలో 40 ఎకరాలు 43 మంది తెల్లరేషన్‌ కార్డు హోల్డర్స్‌ కొన్నారు .తాడికొండలో 190 ఎకరాలు 188 మంది తెల్లరేషన్‌ కార్డు హోల్డర్స్‌ రిజిస్టర్ చేసుకొన్నారు.
తుళ్లూరులో 242 ఎకరాలు 238 మంది తెల్లరేషన్‌ కార్డు హోల్డర్స్‌ కొన్నారు. మంగళగిరిలో 133 ఎకరాలు 148 మంది తెల్లరేషన్‌ కార్డు హోల్డర్స్‌ కొన్నారు. తాడేపల్లిలో 24 ఎకరాలు 49 మంది తెల్లరేషన్‌ కార్డు హోల్డర్స్ కొన్నారు. విచారణ వేగవంతం చేస్తాం..