ఆంధ్రలో ఇసుకంతా జగన్మాయ : చంద్రబాబు నాయుడు

వైసిపి నేతల ఇసుక స్వార్ధానికి రోజూ బేల్ దారీ కూలీలు బలి అవుతున్నారని లక్షలాది కార్మికుల జీవనోపాధిని  జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం  దెబ్బతీసిందని  తెలుగు దేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ రోజు ధ్వజం మెత్తారు.

సొంతూళ్లో ఉన్న వాగుల్లో నుంచి కూడా  ఇసుక తెచ్చుకోడానికి అనేక అడ్డంకులు కలిగిస్తున్నారని, 10రెట్ల ఎక్కువ ధరలకు వైసిపి నేతలు ఇసుక విక్రయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఈ రోజు ఆయన తెలుగుదేశం రాష్ట్ర, జిల్లా నాయకులు, పార్టీ బాధ్యులతో  టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు.

’ఆన్ లైన్ లో ఇసుక అమ్మకాలు అనేది జగన్మాయగా మారిందని అరగంటలోనే నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు,’ అని విమర్శించారు.

ఇలాగే వైసిపి ప్రభుత్వ వేధింపులపై రాజీలేని పోరాటం చేయాలని చెబుతూ చింతమనేని ప్రభాకర్, అఖిలప్రియపై తప్పుడు కేసులు పెట్టారని ఆయన వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో ఏంజరుగుతున్నదో తెలియని అయోమయం ఏర్పడిందని చంద్రబాబు అన్నారు.

చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ విశేషాలు: 

రాష్ట్రంలో ఇసుక సంక్షోభం జగన్ ప్రభుత్వం తప్పిదే. మానవ తప్పిదమే,

చెన్నై,బెంగళూరు,హైదరాబాద్ కు ఇసుక అక్రమ రవాణా
రాష్ట్రంలో ఆర్ధిక కార్యకలాపాలన్నీ దెబ్బతిన్నాయి.

మొత్తం ఆర్ధిక వ్యవస్థ కుదేలయ్యే దుస్తితి తెచ్చారు.

రాజధానిపై ఇంకో కమిటి వేశారు, దానికి సూచనలు ఇవ్వాలట..

గోదావరి-కృష్ణా అనుసందానాన్ని రివర్స్ చేస్తున్నారు
జలాశయాలు ఎందుకు నింపలేదని సీఎం ఇప్పుడు ప్రశ్నించడం హాస్యాస్పదం

వరదల్లో 4వేల క్యూసెక్కులు సముద్రంలోకి వృధాగా పోయాయి.

టిడిపి చేసిన అభివృద్ది పనులన్నీ రివర్స్ చేస్తున్నారు.
టిడిపి నిర్మించిన భవనాలకు వైసిపి రంగులేస్తున్నారు.

ప్రజల్లో టిడిపి అభివృద్ది ముద్ర చెరిపేయాలని పన్నాగాలు పన్నుతున్నారు.

వల్లభనేని వంశీని అక్రమ కేసులతో వేధిస్తున్నారు.
తప్పుడు కేసులతో కోడెలను బలి తీసుకున్నారు..

టిడిపి నాయకులు, కార్యకర్తలను దారుణంగా వేధిస్తున్నారు.

ఆర్ధిక మూలాలు దెబ్బతీస్తున్నారు, అక్రమ కేసులతో వేధిస్తున్నారు
ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీ కోసం కార్యకర్తలు నిలబడ్డారు.

మానవ హక్కుల కమిషన్ బృందం ఈ రోజు రాష్ట్ర పర్యటనకు వచ్చింది

నవంబర్ 1దాకా రాష్ట్రంలో మానవహక్కుల బృందం పర్యటనలు

టిడిపి ఎంపిలు ఢిల్లీలో హ్యూమన్ రైట్స్ కమిషన్ కు వినతి ఇచ్చారు.

దానికి స్పందనగానే రాష్ట్రంలో ప్రతినిధుల బృందం పర్యటిస్తోంది.

ఆత్మకూరు,జంగమేశ్వరపాడు,పిన్నెల్లి,పొనుగుపాడులో పర్యటిస్తారు.

వైసిపి నేతల బాధితులంతా మానవ హక్కుల బృందాన్ని కలవాలి. గత 5నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా 620చోట్ల అరాచకాలకు పాల్పడ్డారు.

హత్యలు,భౌతికదాడులు,ఆస్తుల ధ్వంసం,తప్పుడు కేసులతో వేధిస్తున్నారు.

పొనుగుపాడులో రోడ్డుకు అడ్డంగా గోడ కట్టారు. నెలరోజుల్లో తీయిస్తామని శాసనమండలిలో హామీ ఇచ్చారు.

4నెలలైనా పొనుగుపాడు గోడ తీయించలేదు. ఇది చూసి మిగిలిన చోట్లకూడా వైసిపి నేతలు రెచ్చిపోతున్నారు.

అనంతపురం జిల్లా వెంకటాపురంలో కూడా గోడలు కట్టారు. టిడిపి కార్యకర్తలు అక్కులప్ప, నాగరాజు ఇళ్ల చుట్టూ గోడలు కట్టారు.

ఈ అరాచకాలన్నీ హ్యూమన్ రైట్స్ బృందానికి వివరించాలి.