తెలంగాణ ఆర్టీసి తరహాలో ఇసుక పోరాటానికి చంద్రబాబు సై

ఇసుక సమస్య పరిష్కారానికి అన్ని రాజకీయ పక్షాలు కసికట్టుగా పోరాడేందుకు  జనసేన అధినేత  పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇతర  పార్టీల నాయకులు సానుకూలంగా స్పందిస్తున్నారు.టిడిపి నేత చంద్రబాబు నుంచి కూడా ఆయన సానుకూలస్పందన వచ్చింది.
పవన్ ఈ రోజు అన్ని రాజకీయ పక్షాల అగ్ర నేతలకు ఫోన్ చేశారు.
టిడిపి అధినేత  చంద్ర బాబు ,బిజెపిఅధ్యక్షుడు  కన్నా లక్ష్మీనారాయణతో పాటు సిపిఎం నాయకుడు  మధు, సిపిఐ కార్యదర్శి  రామకృష్ణ, కాంగ్రెస్ నాయకుడు తులసి రెడ్డి లతో  ఇతర పార్టీల నాయకుడు సంపత్ రావు,  డి.వి.వి.ఎస్. వర్మ లకు ఫోన్ చేశారు.
పార్టీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటటామని  కాంగ్రెస్, వామపక్షాలు, లోక్ సత్తా, బి.ఎస్.పి. నేతలు తెలిపారు.
 తెలుగుదేశం అధ్యక్షుడు  చంద్ర బాబు నాయుడుతో ఈ విషయమై మాట్లాడారు. తెలంగాణాలో ఆర్టీసీ సమ్మె కోసం అక్కడి రాజకీయపక్షాలు ఎటువంటి స్ఫూర్తి చూపుతున్నాయో ఇసుక సమస్య పరిష్కారానికి, లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులకు మళ్ళీ ఉపాధి లభించేలా చూడ్డానికి సమైక్యంగా అన్ని రాజకీయ పక్షాలు ముందుకు వెళ్లాలని  పవన్ కళ్యాణ్ కోరారు.
నవంబర్ 3వ తేదీన విశాఖపట్నం లో జనసేన తలపెట్టిన లాంగ్ మార్చ్ కి తెలుగుదేశం కుడా సంఘీభావం ప్రకటించాలని చంద్ర బాబును కోరారు. దీనిపై చంద్రబాబు సానుకూలంగా మాట్లాడారని జనసేన వర్గాలు తెలిపాయి.
 తొలుత ఇదే సమస్య పై బి.జె.పి., ఏ.పి. అధ్యక్షులు  కన్నా లక్ష్మీనారాయణ గారితో మాట్లాడిన సంగతి తెలిసిందే.