జనసేన విశాఖ లాంగ్ మార్చ్ కు హాజరు కానున్న బిజెపి నేతలు

అమరావతి: భవన నిర్మాణ రంగ కార్మికులకుసంఘీ భావంగా విశాఖ లో జనసేన తలపెట్టిన  లాంగ్ మార్చ్ లో పాల్గొనాలని బిజెపినిర్ణయించింది.  పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ మేరుకు చేసిన విజ్ఞప్తికి  ఎపి భారతీయ జనతా పార్టీ  అధ్యక్షులు కన్నా లక్ష్మీ నారశయణ  సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు.
  నవంబర్ 3వ తేదీన విశాఖపట్నంలో తలపెట్టిన లాంగ్ మార్చ్ లో పాల్గొనవలసిందిగా పవన్  ఫోన్ లో కన్నా ని  కోరారు.
ఇసుక దొరకక ఉపాధి కోల్పోయి అల్లాడిపోతూ కార్మికులు ఆహ్మహత్యలకు పాల్పడుతున్నారని చెబుతూ  తాము  లాంగ్ మార్చ్ తలపెట్టడానికి గల కారణాలను కన్నాకు ఆయన వివరించారు.  ఇసుక కొరత వల్ల అధికారిక లెక్కల ప్రకారమే  ప్రత్యక్షంగా 17.80 లక్షల మంది, పరోక్షంగా మరో 17 లక్షల మంది ఉపాధి కోల్పోయారని ఆయన చెప్పారు.
పవన్ఇసుక సంక్షోభానికి వ్యతిరేకంగా అన్ని పక్షాలను ఏకం చేసేందుకు పవన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది  తొలి అడుగు‌.
ఇసుక సమస్య పరిష్కారం కావాలంటే ఆంధ్రప్రదేశ్ లోని అన్ని రాజకీయ పక్షాలు కలసి కట్టుగా పోరాడాల్సిన‌ అవసరం ఉందని,
తెలంగాణాలో జరుగుతున్న ఆర్.టి.సి.సమ్మెలో అక్కడి రాజకీయ పార్టీలు చూపుతున్న సంఘీభావాన్ని, ఐక్యతను ఇసుక సమస్య పరిష్కారంలో కుడా చూపాలని కార్మికులు కోరారు. ఈ ఐక్యత కోసం కృషి చేయాలని వారు పవన్ ని కోరారు. దీని ఫలితమే కన్నాకు ఆహ్వానమని పార్టీ నేతలు చెప్పారు.