ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్: మరో నోటిఫికేషన్ విడుదల

ఏపీ నిరుద్యోగులకు మరొక గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ & ఫైర్ స‌ర్వీసెస్ డిపార్ట్‌మెంట్ హోంగార్డు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా (ఫైర్‌మ్యాన్), హోంగార్డు (డ్రైవర్ ఆపరేటర్) పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టులకు 18–50 సంవత్సరాల మధ్య వయసుండి, 7వ తరగతి ఉత్తీర్ణులైన పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఫైర్ ఫైటింగ్ అండ్ రెస్క్యూ ఆప‌రేష‌న్లలో కనీసం ఐదేళ్ల పని అనుభవం ఉండాల్సి ఉంది.

జనవరి 28 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 18 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *