స్థానిక సంస్థల రిజర్వేషన్ల పెంపు జివొను కొట్లివేసిన హైకోర్టు

అమరావతి: ఏపీలో స్థానిక ఎన్నికలలో రిజర్వేషన్ల అమలు మీద జరిగిన పెంచినరిజర్వేషన్లు చెల్లవని హైకోర్టులో తీర్పు చెప్పింది.
ప్రధాన న్యాయమూర్తి జెకె మహేశ్వరి ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్ ను విచారించారు. స్థానికి సంస్థల ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 59.85 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ జారీ చేసిన జివొ 176 చెల్లదని చెప్పారు.
ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరాం వాదిస్తూ నిజానికి బిసిలకు జనాభా కంటేతక్కువ రిజర్వేషన్లు ఉన్నాయని, బిసిల జనాభా ప్రభుత్వం నిర్వహించిన సర్వే ప్రకారం 48 శాతం ఉందని, అయితే, రాష్ట్ర అందిస్తున్న రిజర్వేషన్లు కేవలం 34 శాతమేనని ఆయన వాదించారు. అంతేకాదు, కొన్ని సందర్బాలలో 50 రిజర్వేషన్ల సీలింగ్ ను సుప్రీంకోర్టు సడలించిన విషయాన్ని కూడా ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా 50 శాతానికిపైగా రిజర్వేషన్లు అమలుచేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన జివొ ను కొట్టి వేయాలని పిటిషనర్ అభ్యర్థించారు. ఇరుపక్షాల వాదనను విన్నతర్వాత రిజర్వేషన్లు 50 శాతం మించడానికి కోర్టు అంగీకరించలేదు. ప్రభుత్వం ఉత్తర్వులను కొటి వేసింది.. నెలలోపు బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.