కాళేశ్వరానికి జాతీయ ప్రాజక్టు హోదా వద్దన్న ఎపి – కెసిఆర్ కు జగన్ షాక్

తెలంగాణలో గోదావరి మీద నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజక్టుకు జాతీయ ప్రాజక్టు హదా ఇవ్వరాదని సుప్రీంకోర్టులో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఇది తెలంగాణకు పిడుగు పాటే.
ఎందుకంటే సరిగ్గా అయిదు నెలల కిందట కాళేశ్వరం ప్రాజక్టు ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిధగా హాజరయ్యారు. ఇపుడు ఆయన నాయకత్వంలోని ఆంధ్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేస్తూ కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వకుండా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని కోరింది.  కాళ్వేశ్వరం ప్రాజక్టు కడితే ఆంధ్ర నీటిహక్కులు దెబ్బతింటాయని రాష్ట్రం వాదించింది. అంతేకాదు, ఇది పాత ప్రాణ హిత చేవెళ్ల ప్రాజక్టు కానేకాదని, అందువల్ల ఇపుడు అనుమతులీయడం కూడా చెల్లదని ఆంధ్రప్రదేశ్ వాదించింది.
ఇది కెసిఆర్ కు జగన్ కు ఇచ్చిన రెండో షాక్. ఇంతకుముందు కృష్ణా గోదావరి నదుల అనుసంధాన పథకాన్నికూడా జగన్ పక్కన పెట్టేశారు. కెసిఆర్ చేపట్టిన పలు ప్రాజక్టుల వల్ల ఆంధ్ర రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయనే విమర్శ వస్తూ ఉంది. ఆంధ్రప్రయోజనాలను దెబ్బతీస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రితో జగన్ రాసుకుపూసుకు తిరగడం రాష్ట్రంలో ఎవరికీ నచ్చడం లేదు. ఇది ప్రతిపక్ష తెలుగుదేశాానికే కాదు, రాయలసీమ ప్రాంతంలో ఉండే జగన్ అభిమానులు కూడా దీనిని జీర్ణించుకోలేకపోతున్నారు.
కాళేశ్వరం ప్రాజక్టు కార్యక్రమానికి హాజరుకావడం, కెసిఆర్ ప్రతిపాదనల ప్రకారం కృష్ణా గోదావరి నదుల అనుసంధానికి ఒప్పుకోవడం తో జగన్ మీద బాగా విమర్శలొచ్చాయి. దీనితో ఆయనలో మార్పు వచ్చిందని అందుకే ఈ రెండుప్రాజక్టులను క్షుణ్ణంగా పరిశీలించాక జగన్ వాటిని వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు.
నదుల అనుసంధానానికి సంబంధించి జగన్ తన ప్రణాళికను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.  ఈ మధ్యలో జగన్ రెండు సార్లు ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలుసుకుని రాష్ట్ర ప్రాజక్టుల గురించి చర్చలు జరిపారు.
కాళేశ్వరం ప్రాజక్టు గోదావరి మీద రు.80 వేల కోట్లతో కడుతున్న ఎత్తిపోతల ప్రాజక్టు.  దీనినినిర్వహణకు భారీ విద్యుత్ కావాలని, ప్రాజక్టు తె్చే ప్రయోజనాలకంటే కరెంటు బిల్లు ఎక్కువవుతుందని రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ కాళేశ్వరాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అయినా కెసిఆర్ ఖాతరు చేయకుండా ముందుకు వెళుతున్నారు. దీనికి భారీగా వ్యయం అవుతూ ఉండటంతో ఈ ప్రాజక్టును జాతీయ ప్రాజక్టుగా గుర్తించాలని ఆయన కేంద్రాన్నికోరుతున్నారు.
In the name of re-engineering, the Telangana government has taken up Kaleshwaram project (in place of original Chevella-Pranahita project) to utilize 225 tmc of Godavari waters. This is a new project with a complete change in scope of the original project. Despite several objections, the central water commission gave the clearances to the project in June 2018,” అని ఎపి నీటిపారుదల శాఖ వాదించింది.
బహుశా జగన్ నుంచి తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి స్పందన వూహించి వుండదు. ఎందుకంటే జూన్ 20వ తేదీన జయశంకర్ భూపాలపల్లి లోని మేడిగడ్డ వద్ద జరిగిన  కాలేశ్వరం ప్రారంభోత్సవానికి జగన్ ఈ ప్రాజక్టును, ముఖ్యమంత్రి కెసిఆర్ దార్శినికతను బాగా కొనియాడారు. అయితే, ఇదే జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నపుడు కాళేశ్వరాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇలా జగన్ వైఖరిన మార్చుకోవడం మీద బాగా విమర్శలొచ్చాయి.