రాజధాని రగడ: మందడంలో 144 సెక్షన్ ఇలా ప్రకటించారు…(వీడియో)

అమరావతి ప్రాంతాంలో రాజధాని తరలింపు వ్యతిరేక ఉద్యమానికి మందడంగ్రామం కేంద్రం. ఈ ఉద్యమం ఇక్కడి నుంచే మొదలయింది. ఇక్కడ  తీవ్రంగా ఉంది. ఇక్కడి నుంచి ఇతరప్రాంతాలకు విస్తరిస్తుందేమోనన్న అందోళన ప్రభుత్వంలో కనిపిస్తుంది. అందుకే ఈచిన్న గ్రామంలో ఇపుడు 144 సెక్షన్ విధిస్తున్నారు. నిర్బంధం బాగా పెరిగింది. రోడ్డు మీద కు వచ్చే వారి మీద కేసులు పెడుతున్నారు. మహిళలని చూడకుండా కొడుతున్నారు. ఈడ్చుకుపోతున్నారు.  ఇపుడు 144 సెక్షన్ మామూలయింది.పోలీసులు ఒక ఇక్కడ 144 సెక్షన విధించినట్లు కవాతుచేస్తూ ప్రకటించారు. దానిమీద గ్రామస్తుల వ్యాఖ్యలు కూడా ఈ వీడియోలో రికార్డయ్యాయి..

ఒక వూరి మీద ఇలా పోలీసులు యుద్ధం ప్రకటించడాన్ని గ్రామస్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. గ్రామస్థులకు, పోలీసులకుచాలాసార్లు వాదులాట జరిగింది.పోలీసులు గ్రామస్థులను రోడ్డు మీదకు రాకుండా నివారించేందుకు ప్రయత్నించడం, దానిని  గ్రామస్థులు ప్రతిఘటించడం జరిగింది. ఈ తోపులాటలో రమణమ్మ అనే మహిళలకు చేయి విరిగింది.మందడం నుంచి 30మందిరైతులను  పోలీసులు అరెస్టుచేసి నిన్న కొల్లిపర స్టేషన్కు తీసుకెళ్లారని గ్రామస్తులుచెప్పారు. ప్రజలెవరూ నిరసన తెలిపేందుకు టెంట్లు వేయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.
ఇది ఇలా ఉంటే, మాచర్ల వైసిపి ఎమ్మెల్యే  పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి  కారు మీద చిన కాకాని వద్ద దాడి జరిగిందని, దీనికి కారణమయిన వారిని గుర్తించాలనే పేరుతో పోలీసులు చాలా మంది అరెస్టు చేస్తున్నారని గ్రామస్థులు విమర్శిస్తున్నారు. తూళ్లూరు గ్రామానికి చెందిన మహ్మద్ జానీ అనే వ్యక్తి కిరొసిన్ వేసుకుని ఆత్మాహుతికి పాల్పడ్డాడు.  పక్కనున్న వాళ్లు కాపాడారు. కారణం, ఆయన సోదరుడిని రామకృష్ణారెడ్డి కారుమీద దాడి చేశాడనే అనుమానంతో పోలీసులు తీసుకెళ్లిహింసించడంతో జానీ నిరసనగా ఈ పని చేసినట్లు చెబుతున్నారు.
ఇక్కడ మహిళల మీద పోలీసులు చూపిన పాశవిక దోరణి  జాతీయ వార్త అయిపోయింది. దీనితో ఇక్కడి పరిస్థితినిపరిశీలించేందుకు  జాతీయ మహిళా కమిషన్  నుంచి ఇద్దరు సభ్యుల బృందం నేడు అమరావతిలో పర్యటిస్తున్నది. రాజధానిని విశాఖ తరలించరాదని, అమరావతిలోనే కొనసాగించాలని  డిమాండుతో  ఆందోళన చేస్తున్న మహిళలపై పోలీసుల దాడులు జరపారు. గాయపరిచారు.   ఈ అంశాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించింది.