రాజధాని వైసిపి జగన్ జాగీరు కాదు: కన్నా

(కన్నా లక్ష్మి నారాయణ)

రాజధాని తరలింపునకు నిరసనగా ఈ రోజు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ మౌన దీక్ష చేశారు. గతం లో ప్రధాని మోడి అమరావతికి శంఖుస్థాపన చేసిన చోటే ఆయన దీక్ష జరిపారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి జగన్ మీద తీవ్రంగా ధ్వజ మెత్తారు. ఆయన ప్రసంగం విశేషాలు:

ఏపి రాజధాని ని అమరావతి లో ఉంచాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. రైతులతో పాటు ప్రభుత్వ భూములకు కూడా కేంద్రం అనుమతులు ఇచ్చింది.  గత ప్రభుత్వం రాజధాని పేరు తో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది. గత ప్రభుత్వ సాకు తో జగన్ ప్రభుత్వం ఏకంగా రాజధానిని అమ్మేస్తుంది.ఈ రాష్టాన్ని జగన్ నిట్టనిలువునా ముంచుతాడని ప్రజలు ఊహించలేదు.
గత ప్రభుత్వం కొంత మంది తో గాలి మాటలు మాట్లాడుస్తే….వైసిపి అంతకంటే బరితెగించింది.ఏపి రాజధాని అమరావతి గానే కేంద్రం గుర్తించి ప్రపంచ పటంలో పెట్టింది.అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కేంద్రం నిధులు ఇచ్చింది.
రైతులు భూములు ఇచ్చి త్యాగాలు చేశారని ట్యాక్స్ మినహాయింపు కూడా కేంద్రం ఇచ్చింది.రైతులు ఇచ్చిన భూములు అమ్మడానికే జగన్ సిద్దమయ్యాడు.
రాజధాని వైసిపి జాగీర్ కాదు.జి.ఎన్.రావు కమిటీ నివేదిక రాక ముందే సీఎం రాజదాని పై ప్రకటన చేస్తాడు.క్యాబినెట్ నిర్ణయం రాకముందే వైజాగ్ లో వైసిపి సంబరాలు జరుపుతుంది.
రాజధాని తరలింపు ను ఎట్టిపరిస్దితుల్లో అంగీకరించం.క్యాబినెట్ నిర్ణయం మేరకు బిజేపి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం.
వైసిపి వాళ్లంతా ఇంగ్లీష్ చదివిన బ్రిటిష్ వారసులు.మేం తెలుగు చదివిన భరతమాత వారసులు.
అమరావతికి ప్రధాని శంకుస్థాపన చేసిన స్థూపం వద్ద కన్నా మౌన దీక్ష