బోస్టన్ నివేదికలో జగన్ చెప్పిందే ఉంటుందంటున్న అమరావతి రైతులు (Video)

అమరావతి రాజధాని తరలింపును నిరసిస్తూ రైతులు చేస్తున్న నిరసన ఆందోళన ఈ రోజు  17వ రోజుకు చేరుకుంది. ఈరోజు అమరావతి గ్రామాలలో సకల‌జనుల సమ్మె చేపట్టారు. స్వచ్ఛందంగా  వ్యాపార సంస్థలు మూసివేశారు. తెరచి ఉంచి టీస్టాల్స్, హోటల్స్ ను జెఎసి నాయకులు మూసేయించారు.
అత్యవసర మైన పాలు, మందులు, ఆసుపత్రులకు సమ్మె నుండి మినహాయింపు ఇచ్చారు. ఉదయం ఎనిమిది గంటలకే ఆందోళన మొదలయింది. మహిళలు కూడా తరలి వచ్చారు.

https://youtu.be/ov2M6Nt9ZoE

తుళ్లూరు లో వాహనాలు వెళ్లకుండా రోడ్ల పై బైటాయించారు. ఈ ముఖ్యమంత్రి జగన్ కు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికను సమర్పిస్తున్నందున వారు ఆందోళన ఉధృతం చేశారు.
బోస్టన్ కన్సల్టింగ్ కంపెనీ అనేది బోగస్ కంపెనీ అని వాళ్ల రిపోర్ట్ జగన్ చెప్పిన విధంగానే ఉంటుందనేది జగమెరిగిన సత్యం  వారు విమర్శిస్తున్నారు. తమ ఉద్యమానికి  ప్రజలు మద్దతు లేదంటున్న నేతలకు బుద్ది ఉందా, కళ్లు ఉండీ చూడలేని గుడ్డి‌వాళ్లయ్యారా అని వాళ్లు ప్రశ్నిస్తున్నారు.
రాజధాని తరలింపు అంటే మా శవాల మీదుగా తీసుకెళ్లాల్సిందే,  విశాఖపట్నం వాసులు జగన్ ను రాజధాని కావాలని అడిగారా అని వారు అంటున్నారా?
జగన్ ను నమ్మి గెలిపిస్తే… మమ్మలను నడి వీధిలో నిలబెట్టారని, ఏ తరహా త్యాగాలకు అయినా మేం సిద్దమని వారు చెబుతున్నారు. అమరావతి ని పూర్తి స్థాయి రాజధాని గా ప్రకటించే వరకు త మ పోరాటం కొనసాగుతుందని వారు ప్రకటించారు.