తెలంగాణ ఆర్థిక సంక్షోభం మీద ఆఖిల పక్షానికి బిజెపి డిమాండ్

(ప్రశాంత్ రెడ్డి)

టిఆర్ ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల తెలంగాణ  ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో పడిపోయిందని, ఈ విషయాన్ని చర్చించటానికి ముఖ్యమంత్రి వెంటనే అఖిల పక్ష సమావేశం ఏర్పాటుచేయాలని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు.

బుధవారం నాడు విలేకరులతో మాట్లాడుతూ  రాష్ట్రం కట్టాల్సిన బకాయిలే 35 వేల కోట్లకు అంటే రికార్డు స్థాయికి చేరుకున్నాయి. భగీరథలోనే పది వేల కోట్ల బకాయి ఉందని ఇక ఇరిగేషన్  శాఖ లో మరొక  10 వేల కోట్లు బకాయిలీలు పేరుకుపోయి ఉన్నాయని ఆయన అన్నారు.  ‘విద్యుత్ డిస్కామ్స్ క్లోజ్ అయ్యే పరిస్థితి వచ్చింది. మిషన్ కాకతీయ 350 కోట్ల బకాయిలు వున్నాయి,  చిరుద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని స్థితి ఉంది. 104 వారికి 5 నెలలుగా జీతాలు లేవు. ప్రభుత్వం అద్దెకు తీసుకుంటున్న వాహనాలకు గత ఆరు నెలలు నుంచి చెల్లించడంమానేశారు. రిటైర్ మెంట్ బెనిఫిట్ లు విడుదలచేయడం మానేశారు.పెన్షన్ లకోసం వృద్ధులు పడరాని పాట్లు పడుతున్నారు. ఒక సైడ్ అప్పలు తెస్తున్నారు.మరొక వైపు బిల్లు చెల్లించడం లేదు. ఏ పథకానికి నిధుల్లేవు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో ముఖ్యమంత్రి వివరించాలి,’ అని డిమాండ్ చేశారు.

అప్పులభారం మీద  ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణ రావు వివరణ ఇస్తూ రాష్ట్రం పచ్చగా ఉందని సొంతంగా సర్టిఫికేట్ ఇవ్వడం హాస్యాస్పదం అన్ని రాకేష్ వ్యాఖ్యానించారు.

అంత పచ్చగా ఉంటే   మరి ఇన్నిబిల్లులు పెండింగు లో ఎందుకు ఉన్నాయో ఆయనే చెప్పాల అని అన్నారు.

కేంద్రం పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్ కూడా కట్టలేని పరిస్థితి ఉందని చెబుతూ కేంద్రం ఒక పథకానికి  2000 కోట్ల కేంద్రం అందిస్తే, 200 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వక ఆనిధులు  మురిగిపోయాయని, ఇది వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్రంలో వడ్డీ లేని రుణాల పథకం ఎందుకు అమలు కావడం లేదో రామకృష్ణ రావు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో అవినీతి, స్కాముల కోసం స్కీమ్ లు, ప్రచారం ఆర్భాటం, పలుకుబడి ఉన్న వాళ్లకే బిల్లు చెల్లించడం,విపరీతంగా నిధుల దుబారా జరగుతూ ఉందని   వీటివల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందని ఆయన అన్నారు.

ఆర్థిక పరిస్థితి పరిచేసేందుకు చర్యలు వెంటనే తీసుకోవాలని లేకపోతే బిజెపి సంప్రదిస్తే తగిన సలహా లిస్తామని అన్నారు. అలాకాని పక్షంలో  అఖిల పక్షాన్ని పిలవండి, సలహాలు తీసుకోండని ఆయన ముఖ్యమంత్రికి సూచించారు.

‘ముఖ్యమంత్రి జోక్యం తీసుకుని ఆర్థికపరిస్థితి  మీద వివరణ ఇవ్వాలి. దీనిని సరిచేసేందదుకు ఏ చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలి.  అఖిలపక్షం సమావేశం  వెంటనే ఏర్పాటుచేయాలి,’ అని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పూజలను అడ్డుకుంటూ ఉంది…

మోదీ ప్రధాని గా మళ్లీ రావాలని వరంగల్ లో ఒక పూజారి పూజలు చేస్తే కాంగ్రెస్ అభ్యంతరం చెప్పడాన్ని రాకేష్ రెడ్డి ఖండించారు. పూజారి మీద ఆలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కు కాంగ్రెస్ ఫిర్యాదు చేయడాన్ని బిజెపి తీవ్రంగా పరిగణిస్తున్నదని అంటూ పూజలు చేయడం ప్రతిహిందువు హక్కు అని ఆయన అన్నారు.  ఈ ఆలయం ప్రభుత్వం ఏలుబడిలో ఉన్నందున అక్కడ పూజారి ఎలా పూజలు చేస్తారని కాంగ్రెస్ ప్రశ్నించడం శోచనీయమని, హిందువుగా పూజచేయడంలో తప్పులేదని ఆయన వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *